Sirivennela Seetharama Sastry: తెలుగు సినీ పరిశ్రమకు ఒక తీవ్ర విషాదాన్ని మిగిల్చి తిరిగి రాని లోకాలకు వెళ్లారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. తన పాటలతో సమాజాన్ని ప్రశ్నించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. జగమంత తన కుటుంబాన్ని వదిలి సినీ అభిమానుల్ని ఏకాకులను చేసి ఆయన మాత్రం లోకాన్ని వీడారు. 3 దశాబ్ధాలు పాటల పూదోటలో ఒలలాడిన చిత్ర పరిశ్రమ… ఆయన మృతితో శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరూ సిరివెన్నెల లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి నివాళులర్పిస్తున్నారు.
Also Read: మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు
ఆయన మరణం సాహిత్య ప్రపంచానికి తీరని లోటంటూ తెలుగు ప్రజలు తల్లిడిల్లిపోతున్నారు. కాగా గూగుల్ కూడా సిరివెన్నెలకు నివాళి ఘటించింది. “సిరివెన్నెల” తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం” అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓకే గూగుల్ ప్లే సిరివెన్నెల సాంగ్స్ అంటూ ట్వీట్‌కు జోడించింది. ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు, సినీప్రముఖులు సందర్శనాంర్ధం ఫిలింఛాంబర్ కు తరలించారు. న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఈనెల 24న సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు.
అప్పటినుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్న కిమ్స్ వైద్యులు ఎప్పటికప్పుడు సిరివెన్నెల ఆరోగ్యాన్ని పరీశిలిస్తూ వచ్చారు. కానీ చివరకు ఆరోగ్యం విషమించడంతో నవంబర్ 31న తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. ఈరోజు సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సిరివెన్నెల మరణవార్తతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన పర్ధివ దేహాన్ని సందర్శించేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు తరలి వస్తున్నారు.