https://oktelugu.com/

AP Govt: ఏపీలో వారందరికీ పెన్షన్ కట్.. జగన్ సార్.. ఏంటది?

AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు వివాదాల్లో చిక్కుకుంది. గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఓటీఎస్ కింద రూ. పదివేలు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడటంపై దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ర్టంలో దోపిడీదారులు, దొంగల పాలన సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు చెల్లించాలని ఏకంగా సర్క్యలర్ జారీ చేయడంపై అందరిలో ఆగ్రహం పెరిగిపోతోంది. పైగా లబ్ధిదారుల ఇళ్లలో పింఛన్ తీసుకునే వారుంటే వారి పింఛన్ నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేయడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. […]

Written By: Srinivas, Updated On : December 1, 2021 1:24 pm
Follow us on

AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు వివాదాల్లో చిక్కుకుంది. గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఓటీఎస్ కింద రూ. పదివేలు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడటంపై దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ర్టంలో దోపిడీదారులు, దొంగల పాలన సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు చెల్లించాలని ఏకంగా సర్క్యలర్ జారీ చేయడంపై అందరిలో ఆగ్రహం పెరిగిపోతోంది. పైగా లబ్ధిదారుల ఇళ్లలో పింఛన్ తీసుకునే వారుంటే వారి పింఛన్ నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేయడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Srikakulam Dist

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి ఏకంగా సర్క్యులర్ జారీ చేయడంపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో కార్యదర్శిపై వేటుకు అధికారులు నిర్ణయించారు. ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత ఎంపీడీవోపై కూడా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం మరోమారు తన వక్రబుద్ధి బయటపెట్టుకుందని తెలుస్తోంది. ప్రజల చేత డబ్బులు కట్టించేందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తే ఇరుకున పడతామనే విషయం వారికి తెలియదా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

మరోవైపు డ్వాక్రా సంఘాల మహిళలను సైతం ఇందులో భాగస్వాములను చేయాలని సంకల్పించినా అది విఫలం కానుందని తెలుస్తోంది. గ్రామ వాలంటీర్లను కూడా పురమాయించి డబ్బులు వసూలు చేయాలని మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓటీఎస్ చార్జీలు వసూలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: KCR: కేసీఆర్ కొత్త వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

ఓటీఎస్ పథకం కింద కట్టాల్సిన డబ్బు కట్టకపోతే ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం ఊహించనిదే. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే జగన్ దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎందుకు ఇంత పట్టుదలగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని తెలుస్తోంది. ప్రజాసమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారినే టార్గెట్ చేసుకోవడంతో విమర్శల పాలవుతోంది. ఇప్పటికైనా ప్రజలను వేధింపులకు గురిచేసే నిర్ణయాలు వద్దని పలువురు సూచిస్తున్నారు.

Also Read: Minimum Support Price Act : కనీస మద్దతుధర చట్టంపై ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదు.. రైతుల డిమాండ్ ఏమిటి..?

Tags