https://oktelugu.com/

KCR: కేసీఆర్ కొత్త వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

KCR: పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చే అన్నట్లుగా ప్రస్తుతం సీఎం కేసీఆర్ పోరు రైతులు తీరున్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ర్టంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా విభేదాలు పెరుగుతున్నాయి. కేంద్రంపై ప్రత్యక్ష పోరుకే కేసీఆర్ రెడీ అవుతున్నారు. అన్ని మార్గాల్లో బీజేపీని అభాసుపాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ధాన్యం కొనుగోలును అస్ర్తంగా ఎంచుకున్నారు. కేంద్రంపై అంచెల వారీగా యుద్ధం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దీనికి గాను కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 1, 2021 1:24 pm
    Follow us on

    KCR: పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చే అన్నట్లుగా ప్రస్తుతం సీఎం కేసీఆర్ పోరు రైతులు తీరున్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ర్టంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా విభేదాలు పెరుగుతున్నాయి. కేంద్రంపై ప్రత్యక్ష పోరుకే కేసీఆర్ రెడీ అవుతున్నారు. అన్ని మార్గాల్లో బీజేపీని అభాసుపాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ధాన్యం కొనుగోలును అస్ర్తంగా ఎంచుకున్నారు. కేంద్రంపై అంచెల వారీగా యుద్ధం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దీనికి గాను కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    KCR

    CM KCR

    బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఆరుతడి పంటలు వేసేందుకు రైతులను సంసిద్ధులను చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. కేంద్రాన్ని బాధ్యులుగా చేస్తూ విమర్శలు చేసేందుకు వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నారు.

    ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఆరుతడి పంటలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పినా రైతులు పట్టించుకోలేదు. ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు రావడంతో ఆ నిర్ణయం వాయిదా వేసుకుంది. దీంతో ప్రస్తుతం కేంద్రంపై నెపం నెట్టి తాము ఏం చేయలేమని చెప్పి ఆ భారం మొత్తం బీజేపీపై వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్రంపై ఆరోపణలు చేసి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది.

    Also Read: Politics: రాష్ట్రంలో తగువులాట.. ఢిల్లీలో నాటకీయత?

    దీనికి గాను మంత్రులు, నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీని దోషిగా చూపుతూ ధాన్యం కొనుగోలును సాకుగా చూపుతూ తాము మాత్రం సేఫ్ గా ఉండాలని ప్రయత్నిస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామని ప్రకటించి మరో వివాదాస్పద నిర్ణయానికి ముందుకు వచ్చింది. దీంతో బీజేపీ నేతల దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్నా రాష్ర్టమే ఎక్కువగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

    Also Read: KCR TRS: కేసీఆర్ కు కోవర్టుల భయం మొదలైందా?

    Tags