Media: ఆంధ్రప్రదేశ్ లో ఏకపక్ష మీడియాలు పెరుగుతున్నాయి. పత్రిక అంటే సమాజంలో జరిగే కళ్లును కడిగేసేదే అనే అర్థాన్ని మార్చేస్తున్నాయి. మనకు పడకపోతే ఎదుటివారిపై వార్తలు రాయడం అనుకూలంగా ఉంటే ఆకాశానికెత్తేయడం పరిపాటిగా సాగుతోంది. దీంతో ఫలానా పత్రిక ఫలానా పార్టీకి సంబంధించింది అనే ముద్ర పడటం దారుణం. పత్రికలు అన్యాయాన్ని ఎత్తిచూపకపోగా వారికి అనుకూలంగా ఉంటూ కథనాలు వెలువరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ర్టంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పలు పత్రికలు తమ సిద్దాంతాలను రాద్దాంతాలుగా మార్చుకుని ఎదుటి వారిపై బురదజల్లేందుకే ప్రయత్నిస్తున్నాయి.

మీడియా ప్రెస్ మీట్లకు కొన్ని పత్రికలను పిలవడం కూడా లేదు. దీంతో అవి కూడా ఏం ప్రశ్నించడం లేదు. మమ్మల్ని ఎందుకు పిలవడం లేదని అడగడం లేదు. ఇటీవల మంత్రి నాని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశానికి కొన్ని మీడియా సంస్థలను ఆహ్వానించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పత్రికలా? లేక పార్టీలా? అనే సందేహాలు వస్తున్నాయి. సమాజంలో జరిగే చెడును ప్రశ్నించాల్సిన వారే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఇతర మీడియా సంస్థలను వెలివేయడం రాజకీయంగా గందరగోళం కలిగిస్తోంది.
Also Read: హే జగన్.. నీ చుట్టూ డేంజరస్ పీపుల్.. జాగ్రత్తగా ఉండాలన్న వర్మ..
పార్టీలు పత్రికలను పంచుకుంటున్నాయి. దీంతో వారు చేసిన దానికి వీరిని పిలవరు. వీరు చేసే దానికి వారిని పిలవకుండా నిర్ణయాలు తీసుకోవడంతో రాష్ర్టంలో విచిత్రకర పరిణామాలు జరుతున్నాయి. పత్రిక అంటేనే ప్రశ్నించే గొంతు అనే అర్థాన్ని మార్చేసి పత్రిక అంటే పార్టీకి తొత్తు అనే విధంగా మారుస్తున్నారు. దీంతో మీడియా గౌరవం రోజురోజుకు దిగజారి పోతోంది. మరోవైపు సామాజిక మాధ్యమాల జోరు కొనసాగుతున్నా పత్రికల్లో ఇంకా మార్పు రాకపోవడం గమనార్హం.
ప్రజాస్వామ్యంలో విలువలకు పెద్దపీట వేయాల్సిన మీడియా పక్కదారి పడుతోంది. ఫలితంగా ప్రజాసమస్యల పరిష్కారాలు పరిష్కారానికి నోచుకోవం లేదు. తమకు ఇష్టం లేని వారిపై కథనాలు ప్రసారం చేస్తూ తమకు ఇష్టమైన వారికి అనుకూలంగా చేయడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం మీడియా రంగం అపహాస్యం అవుతోంది. ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నాయి. సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ హేయమైన విధంగా ప్రవరిస్తున్నాయి. దీంతో రాష్ర్టంలో ఈ విష సంస్కృతి తొలగిపోయేందుకు ఎవరో నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది.
Also Read: రాజీనామాకు రఘురామ సిద్ధం..మళ్లీ గెలవడం కల్ల?