https://oktelugu.com/

EMK: మహేష్ బాబుతో ఎన్టీఆర్ ఫన్.. ఫ్యాన్స్ కు పూనకాలే?

EMK: బుల్లితెరపై ప్రసారం అవుతున్న రియల్టీ షోల్లో ‘ఎవరు మీలో కోటేశ్వరుడు’ ఒకటి. సామాన్యుడి నుంచి సెలబెట్రీల దాకా ప్రతీఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని కోటి రూపాయలను గెలుచుకునే సువర్ణ అవకాశం ఉంది. దీంతో సహజంగానే ఈ షోపై అందరికీ ఆసక్తి పెరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ప్రశ్నలు వేస్తూ పార్టిసిపేట్స్ నుంచి జవాబులను రాబడట్టడం ఈ షో ప్రత్యేకతగా చెప్పుకొవచ్చు. తొలినాళ్లలో ఈ షో‘మా’టీలో ప్రసారం అయింది. ఆ సమయంలో కింగ్ నాగార్జున, మెగాస్టార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 2, 2021 / 05:02 PM IST
    Follow us on

    EMK: బుల్లితెరపై ప్రసారం అవుతున్న రియల్టీ షోల్లో ‘ఎవరు మీలో కోటేశ్వరుడు’ ఒకటి. సామాన్యుడి నుంచి సెలబెట్రీల దాకా ప్రతీఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని కోటి రూపాయలను గెలుచుకునే సువర్ణ అవకాశం ఉంది. దీంతో సహజంగానే ఈ షోపై అందరికీ ఆసక్తి పెరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ప్రశ్నలు వేస్తూ పార్టిసిపేట్స్ నుంచి జవాబులను రాబడట్టడం ఈ షో ప్రత్యేకతగా చెప్పుకొవచ్చు.

    Mahesh With NTR EMK

    తొలినాళ్లలో ఈ షో‘మా’టీలో ప్రసారం అయింది. ఆ సమయంలో కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు ఈ షోకు హోస్టుగా చేసి బుల్లితెర ఫ్యాన్స్ ను అలరించారు. ప్రస్తుతం ఈ షో ‘జెమినీ’ టీవీలో ప్రతీ ఆదివారం 8:30గంటలకు ప్రసారం అవుతోంది. ఈ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తూ అభిమానులను ఎంటటైన్ చేస్తున్నారు.

    ఈ షోలో ఇప్పటికే పలువురు స్టార్ హీరో హీరోయిన్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు స్పెషల్ గెస్టులుగా వచ్చారు. వీరు గెలుచుకునే అమౌంట్ ఛారిటీకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. సామాన్యులు మాత్రం గెలుచుకున్న డబ్బును తమ ఇష్టానికి ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ షోలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే గెస్ట్ గా రాబోతున్నారు.

    మహేష్ బాబుతో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఫన్, సరదా సరదా ప్రశ్నలకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే రిలీజై అభిమానులకు అలరిస్తోంది. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ డేట్ ను కూడా జెమిని టీవీ తాజాగా ప్రకటించింది. ఈ షో డిసెంబర్ 5న(ఆదివారం) రాత్రి 8:30గంటల కు ప్రసారం కానుందని పేర్కొంది.

    Also Read: ‘అఖండ’ మూవీ రివ్యూ

    స్టార్ హీరోలైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఒకే షోలో పాల్గొనడటంతో ఈ గేమ్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక మహేష్ బాబు ఒక ప్రశ్న దగ్గర తడబడగా ఫోన్ ఇన్ కాల్ తీసుకున్న సమయంలో పవన్ కల్యాణ్ గేమ్ లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

    ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారివారిపాట’ మూవీలో నటిస్తూ ఫుల్ బీజీగా ఉన్నారు. ఈ మూవీలో మహేష్ కు జోడీ మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక జూనియ్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న రిలీజు కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అత్రుతుగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ ఆదివారం ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమం సినీ, బుల్లితెర ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కన్పిస్తోంది.

    Also Read: సీనియర్ నటుడు శరత్​బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా ఆయుష్​