https://oktelugu.com/

Adilabad: నిలువెల్లా అనుమానం.. భార్యపై అప నమ్మకం.. చివరికి ఈ భర్త ఏం చేశాడంటే..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఖుర్షీద్ నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఇటీవల గుర్తుపట్టలేని స్థితిలో ఒక మహిళ మృతదేహం లభించింది.. స్థానికంగా ఇది కలకలం సృష్టించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 17, 2024 / 09:36 AM IST

    Adilabad

    Follow us on

    Adilabad: పెళ్లి అనే బంధంతో ఒక స్త్రీ మరో పురుషుడితో మూడు ముళ్ళు వేయించుకుంటుంది. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను, అయిన వాళ్లను కాదనుకొని భర్త దగ్గరికి వచ్చేస్తుంది. భర్తే లోకంగా బతుకుతుంది. అలాంటి భార్యను భర్త ప్రేమగా స్వీకరించాలి. ఆమెకు ప్రతిక్షణం లో అండగా నిలవాలి. కలకాలం తోడుంటాననే భాసను నిజం చేసి చూపించాలి. ఇలా భార్యాభర్తల మధ్య అన్యోన్య బంధం ఉన్నప్పుడే సంసారం సజావుగా సాగుతుంది. ఒకరికి ఒకరు అన్నట్టుగా వారి మధ్య ప్రేమ పరిఢవిల్లుతుంది. ఇందులో ఏమాత్రం తేడా జరిగినా.. సంసారం విచ్ఛిన్నమవుతుంది. ఇప్పుడు మీరు చదవబోయే కథనం అటువంటిదే. భర్తలో మెదిలిన అనుమానం ఆ కుటుంబాన్ని నాశనం చేసింది.

    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఖుర్షీద్ నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఇటీవల గుర్తుపట్టలేని స్థితిలో ఒక మహిళ మృతదేహం లభించింది.. స్థానికంగా ఇది కలకలం సృష్టించింది. ఆ ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్న కొంతమందికి ఆ మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.. ఆ మృతదేహం ఫోటోలను ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లకు పంపించారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు.. అయితే వారు దర్యాప్తు చేయగా దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

    ఖుర్షీద్ నగర్ ప్రాంతానికి చెందిన ఖలీల్ ఖాన్ ఆటో డ్రైవర్ గా పని పనిచేస్తున్నాడు. గతంలోనే ఇతడికి వివాహమైంది. అప్పట్లో ఏం జరిగిందో తెలియదు కానీ మొదటి భార్యతో అతడు విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత భారతి(35) అనే మహిళతో వివాహేతర సంబంధం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరును సల్మాగా మార్చాడు. మొదట్లో వీరి సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాత భారతి ఇతరులతో వివాహేతర సంబంధం నడుపుతోందని ఖుర్షీద్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యతో చీటికిమాటికి గొడవలు పడుతూనే ఉన్నాడు. ఈనెల 12న అందరికీ ఒక కిరాయి తగలడంతో వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అర్ధరాత్రి 12 తర్వాత ఇంటికి వచ్చాడు. అతడి అలికిడి వినిపించడంతో ఇంట్లో నుంచి కొందరు వ్యక్తులు బయటికి పరిగెత్తారు. దీనిని గమనించిన అతడు.. తన భార్యకు, ఇతరులతో వివాహేతర సంబంధం నడుస్తుందని భావించాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో గట్టిగా తన్నడంతో చనిపోయింది. అదే రాత్రి ఖలీల్ తన ఆటోలో భారతి మృతదేహాన్ని వేసుకొని.. ఖుర్షీద్ నగర్ ప్రాంతంలో పడేశాడు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో… అటువైపుగా మార్నింగ్ వాక్ వెళ్తున్న కొందరు ఆ మృతదేహాన్ని చూశారు. విషయాన్ని పోలీసులకు చెప్పడంతో.. వారు తమదైన శైలిలో విచారణ సాగించారు. మొత్తానికి ఖలీల్ ను అరెస్టు చేశారు. రిమాండ్ కు తరలించారు.. అయితే ఇంత జరిగినప్పటికీ ఖలీల్ లో ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోవడం విశేషం.