Samantha: సమంతకు ఇలా కావాల్సిందే… కుక్క పని గాడిద చేసినట్లుంది!

తప్పుడు సూచనలు చేస్తున్న సమంతను జైల్లో పెట్టాలి. సమంత సలహా పాటిస్తే ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఒకింత ఫైర్ అయ్యాడు. డాక్టర్ లివర్ డాక్ కి సమంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదవారి కోసం నేను ఇలాంటి హెల్త్ టిప్ ఇచ్చాను. సదరు డాక్టర్ నన్ను విమర్శించడం కంటే... నాకు ఈ సలహా ఇచ్చిన డాక్టర్ తో ముఖాముఖీ భేటీకి కూర్చుంటే బాగుంటుందని.. కౌంటర్ ఇచ్చింది.

Written By: S Reddy, Updated On : July 7, 2024 11:05 am

Samantha

Follow us on

Samantha: వెనకటికి ఓ సామెత ఉంది. కుక్క పని గాడిద చేసిన తన్నులు తిందట. సమంత పరిస్థితి అలానే ఉంది. ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ హెల్త్ టిప్ వివాదం రాజేసింది. ఓ డాక్టర్ సమంత సూచనను ఖండిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా సమంతను జైల్లో పెట్టాలి అన్నాడు. సమంత చెప్పిన ఆ హెల్త్ టిప్ ఏమిటంటే.. వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ నీటిలో కలిపి లోపలి పీలిస్తే ఉపశమనం కలుగుతుందట. ఈ సూచనను డాక్టర్ లివర్ డాక్ ఖండించారు.

ఇలాంటి తప్పుడు సూచనలు చేస్తున్న సమంతను జైల్లో పెట్టాలి. సమంత సలహా పాటిస్తే ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఒకింత ఫైర్ అయ్యాడు. డాక్టర్ లివర్ డాక్ కి సమంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదవారి కోసం నేను ఇలాంటి హెల్త్ టిప్ ఇచ్చాను. సదరు డాక్టర్ నన్ను విమర్శించడం కంటే… నాకు ఈ సలహా ఇచ్చిన డాక్టర్ తో ముఖాముఖీ భేటీకి కూర్చుంటే బాగుంటుందని.. కౌంటర్ ఇచ్చింది.

సమంత తీరుపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా సైతం విమర్శలు గుప్పించారు. సమంత హెల్త్ టిప్స్ ఇవ్వడాన్ని ఆమె వ్యతిరేకించారు. నువ్వు చెప్పినట్లు చేసి ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకుంటే నువ్వు, నీకు సలహా ఇచ్చిన డాక్టర్ బాధ్యత వహిస్తారా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ వివాదం నేపథ్యంలో నెటిజెన్స్ రెండుగా విడిపోయారు. కొందరు సమంతను సమర్థిస్తున్నారు. కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

ఏది ఏమైనా సమంత వైపే తప్పు కనిపిస్తుంది. మెడికల్ అడ్వైజ్ అనేది సున్నితమైన అంశం. మనుషుల ప్రాణాలకు సంబంధించిన విషయం. సమంత సూచనలు ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్నా, డోసేజ్ విషయంలో తేడా వచ్చినా ప్రాణాలకు ముప్పు రావచ్చు. లక్షల మందికి స్ఫూర్తిగా ఉన్న సమంత వంటి సెలెబ్రిటీలు కొన్నిరకాల వైద్య సలహాలు ఇవ్వకపోవడమే మంచిది. కారణం.. సమంత ఒక యాక్ట్రెస్. ఆమెకు వైద్యం గురించి తెలియదు. ఎవరో చెప్పారని ఆమె సాధారణ జనాలకు సూచనలు చేయడం సరికాదు. ఆమె ఫుడ్, బ్యూటీ, యోగ, వ్యాయామంకి సంబంధించి టిప్స్ ఇవ్వడంలో తప్పు లేదు. ఇకపై సమంత ఇలాంటి ఆరోగ్య సలహాలు ఇవ్వదని ఆశిద్దాం..