Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – శంకర్ కాంబో లో రావాల్సిన సినిమా ఆగిపోవడానికి కారణం ఎవరో తెలుసా..?

లంచం తీసుకోవడం నేరం అంటూ తన సినిమాల్లో చెబుతూ వస్తూ ఉంటాడు. మరి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న శంకర్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ ఫుల్ హీరోతో అలాగే అన్యాయాన్ని వ్యతిరేకిస్తు, అవినీతిని ఎండగట్టాలనుకునే పవన్ కళ్యాణ్ తో అలాంటి ఒక సినిమా చేస్తే భారీగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో 'అన్నా హజారే' ఇన్స్పిరేషన్ తో ఒక కథ రెడీ చేసుకొని దాన్ని పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నాడట.

Written By: Gopi, Updated On : July 17, 2024 12:41 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంకా ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. అందులో మొదటగా చిరంజీవి సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో సక్సెస్ ను సాధించి మెగాస్టార్ గా ఎదిగాడు. ఇక ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడమే కాకుండా భారీ సక్సెస్ లను కూడా అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక వాళ్ళ అన్నయ్య వేసిన బాటలో నడుస్తూనే తనకంటూ ఒక సపరేట్ మేనరిజాన్ని ఏర్పాటు చేసుకొని యావత్ తెలుగు ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా కొనసాగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే. మరి ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గతంలో తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అది అనుకోని కారణాలవల్ల ఆగిపోయింది. నిజానికి శంకర్ అవినీతిపైన సినిమాలు చేయడంలో దిట్ట…

లంచం తీసుకోవడం నేరం అంటూ తన సినిమాల్లో చెబుతూ వస్తూ ఉంటాడు. మరి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న శంకర్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ ఫుల్ హీరోతో అలాగే అన్యాయాన్ని వ్యతిరేకిస్తు, అవినీతిని ఎండగట్టాలనుకునే పవన్ కళ్యాణ్ తో అలాంటి ఒక సినిమా చేస్తే భారీగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ‘అన్నా హజారే’ ఇన్స్పిరేషన్ తో ఒక కథ రెడీ చేసుకొని దాన్ని పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నాడట. కానీ పవన్ కళ్యాణ్ కి డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమాని చేయకుండా వదిలేసినట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి. ఇక ఈ సినిమా పట్టలెక్కకపోవడానికి ఇదొక కారణం అయితే, మరొక కారణమేమిటంటే పవన్ కళ్యాణ్ అవినీతి పైన సినిమాలు చేసి జనాల మీద తన అభిప్రాయాన్ని రుద్దాల్సిన అవసరం లేదని అనుకుంటాడట.

ఎందుకంటే తను నిజజీవితంలో అవినీతి, అన్యాయాల పైన పోరాడుతూ ఉంటాడు. కాబట్టి దానికి ప్రత్యేకించి సినిమా ద్వారా చెప్పాలి అని మాత్రం అనుకోడట. తను ఏం చేసినా నిజజీవితంలోనే చేయాలి అనుకుంటాడు కాబట్టి వాటిని సినిమా ద్వారా చెప్పే దానికంటే తను డైరెక్ట్ చేయడమే బెస్ట్ అని అవినీతిని అంతం చేసే సినిమాలు తన దృష్టి కి వచ్చిన వాటి మీద ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టలేదట. ఇక ఇలాంటి సినిమాలు చూస్తే ప్రజలకు కూడా వీళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు అని అనుకుంటారనే ఉద్దేశ్యం తోనే తను మంచి పని ఏది చేసిన అది నిజ జీవితం లో చేస్తాడట. ఇక కేవలం జనాన్ని ఎంటర్ టైన్ చేయడానికి మాత్రమే సినిమాలు చేస్తానని కూడా చాలా స్టార్లు చెప్పాడు…

ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ శంకర్ కాంబినేషన్ లో రావాల్సిన ఒక సూపర్ హిట్ సినిమానైతే మనం మిస్ అయిపోయామనే చెప్పాలి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు చేస్తు బిజీగా ఉంటే శంకర్ మాత్రం రీసెంట్ గా ‘భారతీయుడు 2’ సినిమా చేసి భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడనే చెప్పాలి…ఇక పవన్ కళ్యాణ్, శంకర్ కాంబో లో ఫ్యూచర్ లో అయిన ఒక కమర్షియల్ సినిమా వస్తుందేమో చూడాలి…