Hyundai Exter CNG: కార్లు కొనాలనుకువారి అభిప్రాయాలు విభిన్నంగా ఉంటాయి. కొందరు పెట్రోల్ వేరియంట్ కారును కొనాలని చూస్తే.. మరికొందరు డీజిల్ కార్లను ఎక్కువగా ఇష్టపడతూ ఉంటారు. ఇంకొందరు ఎలక్ట్రిక్ కార్లు కావాలని కోరుకుంటారు. అయితే పెట్రోల్ కార్లకు ప్రత్యామ్నాయంగా CNG కార్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి పెట్రోల్ కార్ల కంటే ఇంధన తక్కువ అవసరం ఉండి ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. అంతేకాకుండా లాంగ్ డ్రైవ్ చేసేవాళ్లకు సీఎన్ జీ కార్లు బెస్ట్ అని కొందరు కార్లు వినియోగించిన వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా CNG కార్ల ఉత్పత్తిపై ఫోకస్ పెడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కొన్ని కార్లలు ఒక CNG సిలిండ్ మాత్రమే ఉండేది. డ్యూయెల్ సిలిండర్లు కలిగిన ఈ కార్ల గురించి తెలుసా?
సాధారణంగా ఒక కారులు పెట్రోల్ తో పాటు ఒక CNG సిలిండర్ మాత్రమే ఉంటుంది. అయితే దీని వల్ల లాంగ్ డ్రైవ్ చేసేవాళ్లు తమ లగేజీ కోసం ఇబ్బంది పడేవాళ్లు. కానీ వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని టాటా పంచ్ మొదటి సారిగా CNG డ్యూయెల్ సిలండర్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ కారుకు ఇప్పుడు పోటీగా హ్యుందాయ్ సైతం డ్యూయెల్ సిలిండర్ల కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ కార్లు దూసుకుపోతున్నాయి. ఎస్ యూవీ కార్లను తీసుకురావడంలో హ్యుందామ్ ముందుంటుంది. అయితే ఇప్పటికే రిలీజ్ చేసిన హ్యుందాయ్ ఎక్స్ టర్ ను డ్యూయెల్ సిలిండర్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఇప్టికే ఎలక్ట్రిక్ ఆప్షన్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ లో కూడా లభించనుంది. ఇప్పటి వరకు టాటా కంపెనీకి చెందిన పంచ్ మాత్రమే డ్యూయెల్ సిలిండర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు పంచ్ కు ఎక్స్ టర్ గట్టి పోటీ ఇవ్వనుంది.
హ్యుందాయ్ ఎక్స్ టర్ ను ఇప్పటికే వినియోగదారులు ఎక్కువగా ఆదరించారు. ఇది కొత్తగా అవతరించి మార్కెట్లోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే 93 వేల అమ్మకాలను సాధించింది. దీంతో ఇప్పటి వరకు ఈ వేరియంట్ లో దూసుకుపోతున్న పంచ్ కు గట్టి పోటీ ఇచ్చిందని అన్నారు. ఇప్పుడు డ్యూయెల్ సిలిండర్ల ఆప్షన్లలోనూ పంచ్ కు ఎక్స్ టర్ పోటీకి వచ్చింది. డ్యూయెల్ సిలిండర్ గా అవతరించిన ఎక్స్ టర్ వివిధ ప్యాక్ లో మార్కెట్లోకి వచ్చింది. వీటిలో అట్లాస్ వైట్, కాస్మిక్ బ్లూ, స్టార్రి నైట్, టైటాన్ గ్రే, పైరీ రైడ్ వంటివి ఉన్నాయి.
ఎక్స్ టర్ ఇంజిన్ విషయానికొస్తే 1.2 లీటర్ పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ ను కలిగి ఉంది. ఇందులో సీఎన్ జీ ఆప్షన్ నుంచి 27.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ పై 19.2 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఎక్స్ టర్ లో సేప్టీ ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. ఇక ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఛార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్యూయెల్ డ్యాస్ కెమెరా, ఫుట్ వెల్ లైటింగ్, పాడిల్ పిస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ ఎక్స్ టర్ ను రూ.5.99 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు. పెట్రోల్ తో పాటు సీఎన్ జీ కారు కావాలనుకునే వారికి ఇది లో బడ్జెట్ కారు అని అంటున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్ వేసేవారికి లగేజీ బెనిఫిట్స్ కూడా ఇందులో ఉంటాయని తెలుపుతున్నారు.