Prabhas: ప్రభాస్ హను రాఘవపూడి కాంబో లో వస్తున్న సినిమా పట్టలెక్కేది ఎప్పుడో తెలుసా..?

గత సంవత్సరం వచ్చిన సలార్ సినిమాతో 800 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాడు. ఇక కల్కి సినిమాతో ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక మొత్తానికైతే ప్రభాస్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు.

Written By: Gopi, Updated On : July 16, 2024 9:40 am

Prabhas

Follow us on

Prabhas: సినిమా ఇండస్ట్రీ లో ఒక్కొ సందర్భంలో ఒక్కో హీరో క్రేజ్ అనేది తారా స్థాయిలో ఉంటుంది. నిజానికి ఇప్పుడు ఇండియా వైడ్ గా ప్రభాస్ క్రేజ్ అనేది ఆల్మోస్ట్ టాప్ రేంజ్ లో ఉందనే చెప్పాలి. ఇక తనను బీట్ చేసే హీరో ఎవరు లేరు అనేంతలా తను ఒక్కడే భారీ సక్సెస్ లను అందుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఇదిలా ఉంటే రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమాతో కూడా మరొకసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇప్పటికైనా ప్రభాసే నెంబర్ వన్ హీరో అని అందరూ ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆయన వరుసగా సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక గత సంవత్సరం వచ్చిన సలార్ సినిమాతో 800 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాడు. ఇక కల్కి సినిమాతో ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక మొత్తానికైతే ప్రభాస్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని కూడా 2025 వ సంవత్సరంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేస్తున్న ‘స్పిరిట్ ‘ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

మరి ఆ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడు అనే విషయం తెలీదు గానీ ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దీంతోపాటుగా హను రాఘవపూడి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ను హను రాఘవపూడి తొందర్లోనే తెలియజేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక నిజానికి హను రాఘవపూడి ఇంతకుముందు ‘ సీతా రామం’ సినిమాతో ఒక సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాబట్టి అదే యుద్ధ బ్యాక్ డ్రాప్ లోనే ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక అందుకోసమే ఒక భారీ కథను రెడీ చేసి ముందుకు సాగుతున్నాడు. ఇక అందులో భాగం గానే ప్రభాస్ చేత భారీ యుద్ధాన్ని చేయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా 2025 సమ్మర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ గ్యాప్ లో ప్రభాస్ స్పిరిట్ సినిమాను చేసి దాన్ని కూడా తొందర్లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. మరి హను రాఘవపూడి కి ఇంతకుముందు స్టార్ హీరోలను హ్యాండిల్ చేసిన అనుభవమైతే లేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు.

కాబట్టి ఆయన ఏ విధంగా ప్రభాస్ ని హ్యాండిల్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ తను కనక ప్రభాస్ ని చాలా బాగా హ్యాండిల్ చేసినట్టయితే ఆయన టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోతాడు. లేదంటే మళ్లీ మీడియం రేంజ్ డైరెక్టర్ గా కొనసాగాల్సినా పరిస్థితి అయితే వస్తుంది. ఇక ఇలాంటి స్టార్ హీరో దొరికినపుడు ఒక మంచి కథతో సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతుందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రాబోయే సినిమాలతో ప్రభాస్ ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…