Postal Jobs: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పది పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులో తెలుసా!

కేంద్రంలో ఇటీవలకే మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. మోదీ ఉద్యోగాలు భర్తీ చేయలేదన్న అపవాదు ఉంది. విపక్ష కాంగ్రెస్‌ పార్లమెంటు ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లింది. తాము అధికారంలోకి వస్తే భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. అయినా కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మోదీ ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టారు.

Written By: Raj Shekar, Updated On : July 16, 2024 9:25 am

Postal Jobs

Follow us on

Postal Jobs: నిరుద్యోగులకు ఇండియన్‌ పోస్టల్‌ శాఖ శుభవార్త చెప్పింఇ. పది పాస్‌ అయి కొలువు కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది నిజంగా శుభవార్తనే. ఉన్నత చదువులు చదివినా కొలువులు రావడం లేదని అనేక మంది రోడ్ల వెంట తిరుగుతున్నారు. ఈ తరుణంలో పోస్టల్‌ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 44 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది.

ఇవీ ఉద్యోగాలు..
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఏటా వేల సంఖ్యలో గ్రామీణడాక్‌ సేవక్‌(జీడీఎస్‌) పోస్టులను భారత పోస్టల్‌ శాక భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా భారీగా జీడీఎస్‌ కొలువుల భర్తీకి పోస్టల్‌ శాఖ సన్నాహాలు చేస్తుంది.

44,228 ఖాళీలు..
కేంద్రంలో ఇటీవలకే మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. మోదీ ఉద్యోగాలు భర్తీ చేయలేదన్న అపవాదు ఉంది. విపక్ష కాంగ్రెస్‌ పార్లమెంటు ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లింది. తాము అధికారంలోకి వస్తే భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. అయినా కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మోదీ ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పోస్టల్‌ శాఖలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చారు. దీంతో 44,228 ఖాళీలతో పోస్టల్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా జీడీఎస్‌ లేదా బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(ఏబీపీఎం) లేదా డాక్‌ సేవక్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పదో తరగతే విద్యార్హత..
పదో తరగతి పాస్‌ అయ్యి ఉండి ప్రభుత్వ ఉద్యోగం పొందాలని భావించే వారికి ఇదో సువర్ణావకాశం. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారి వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రక్రియ జూలై 15న ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 5.

రాత పరీక్ష లేకుండానే..
ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈమేరకు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు అర్హులు అయితే వెంటనే అప్లయ్‌ చేయండి.

వేతనం ఇలా..
– బ్రాంచి పోస్టు మాస్టర్‌(బీపీవో) ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 12 వేల నుంచి రూ.29,380 వరకు వేతనం చెల్లిస్తారు. అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ ఉద్యోగానికి సెలక్ట్‌ అయిన అభ్యర్థికి నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు జీతంగా ఇస్తారు. రోజుకు కేవలం 4 గంటలు పని చేస్తే చాలు.

ఇలా దరఖాస్తు చేయాలి..
అర్హత, ఆసక్తి ఉన్నవారు ముందుగా పోస్టాఫీస్‌ అధికారిక వెబ్‌సైట్‌.. https://www.indiapostgdsonline.gov.in ను ఓపెన్‌ చేయాలి. తర్వాత దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌నంబర్, పాస్‌వర్డ్‌ కోసం.. అప్లికేంట్లకు సొంత మెయిల్‌ ఐడీ, మొబైల నంబర్‌ ఉండాలి. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ జనరేట్‌ అయిన తర్వాత సైట్‌లో లాగిన్‌ అయి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.

– తర్వాత ఆసక్తి ఉన్న పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అనంతరం అభ్యర్థి డివిజన్‌ ఎంపిక చేసుకోవాలి. ఇటీవల దిగిన పాస్‌పోర్టు సైజు ఫొటో, అభ్యర్థి సంతకాన్ని.. చెప్పిన ఫార్మాట్, సైజుల్లో అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత కింద ఉన్న సబ్మిట్‌ బటన్‌ నొక్కాలి. చివరగా మీరు ఏ డివిజిన్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ డివిజన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

త్వరపడండి..
44 వేల పైచిలుకు పోస్టులు.. అదీ పదో తరగతి అర్హత.. ఎలాంటి రాత పరీక్ష లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. మీరు పదో తరగతిలో మంచి మార్కులు సాధించి ఉంటే.. మీకన్నా ముందు ఎవరూ లేని పక్షంలో మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ.