https://oktelugu.com/

Klin Kaara Upasana: క్లిన్ కార-ఉపాసనలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటో తెలుసా? చిరంజీవి కనిపెట్టలేకపోయాడే, వీడియో వైరల్

ప్రస్తుతం చిరు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా చేస్తుంది. గత ఏడాది వచ్చిన భోళా శంకర్ నిరాశపరిచింది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 10, 2024 / 06:39 PM IST

    Klin Kaara Upasana

    Follow us on

    Klin Kaara Upasana: మెగా స్టార్ చిరంజీవి మే 9న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతదేశ రెండవ పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. అయితే ఈ అవార్డు తీసుకోవడానికి కొని నిమిషాల ముందు చిరంజీవికి కోడలు ఉపాసనతో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అవార్డు కార్యక్రమానికి వెళ్ళడానికి చిరంజీవి డ్రెస్సింగ్ రూమ్ లో హడావుడిగా ఉన్నారు.

    అదే సమయంలో ఉపాసన ఒక ప్రశ్న అడిగింది. ” మామయ్య .. క్లింకారకు నాకు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటి చెప్పండి?” అని అడిగారు ఉపాసన. దీనికి ”క్లింకార అంటే నీ ప్రతిరూపం అంతే” అని చిరంజీవి సమాధానం చెప్పారు. దీంతో ఉపాసన నవ్వుతూ ” కాదు .. మేమిద్దరం పద్మవిభూషణ్ ల మనవరాళ్ళం” అని చిరంజీవికి కూడా అవగాహన లేని విషయం ఉపాసన గుర్తు చేసింది. దీంతో చిరంజీవి నవ్వుతూ అవును కదా అన్నారు. కాగా 2010లో ఉపాసన తాత ప్రతాప్ సీ రెడ్డి కి పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించబడ్డారు.

    కాగా ఈ పురస్కారం అందుకున్న తర్వాత చిరంజీవితో కలిసి రామ్ చరణ్ ఫోటో తీసుకుని షేర్ చేశారు. చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ”కళామతల్లికి, కళారంగంలో నన్ను వెన్ను తట్టి నడిపించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. నన్ను ప్రేమించిన, అభిమానించిన అందరికీ కృతజ్ఞతలు. పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు” అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

    ప్రస్తుతం చిరు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా చేస్తుంది. గత ఏడాది వచ్చిన భోళా శంకర్ నిరాశపరిచింది. దీంతో ఈసారి భారీ కొట్టాలని చిరు పట్టుదలతో ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.