Mega Brothers: మెగా బ్రదర్స్ ముగ్గురిలో పవన్ కళ్యాణ్ ఏంటి అలా ఉన్నాడు..వైరల్ ఫోటోలు…

40 సంవత్సరాల క్రితం మెగా బ్రదర్స్ ముగ్గురితో పాటు వాళ్ళ సిస్టర్స్ తో దిగిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ చాలా చిన్నగా ఉన్నాడు.

Written By: Gopi, Updated On : May 10, 2024 6:12 pm

Mega Brothers

Follow us on

Mega Brothers: మెగా ఫ్యామిలీ హీరోలు ఏం చేసిన అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. మిగితా వాళ్ళతో పోలిస్తే ఇండస్ట్రీ లో వాళ్ళకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తనదైన రీతిలో ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఒక 40 సంవత్సరాల క్రితం మెగా బ్రదర్స్ ముగ్గురితో పాటు వాళ్ళ సిస్టర్స్ తో దిగిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ చాలా చిన్నగా ఉన్నాడు. ఇక మెగా ఫ్యామిలీ ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఫోటోను చూసిన చాలా మంది అభిమానులు పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలా ఉన్నాడో,ఇప్పుడు అఖిరా నందన్ కూడా అలాగే ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ హవా అనేది మామూలుగా లేదనే చెప్పాలి.

ఇక ఇప్పటికి కూడా ఆయన స్టార్ డమ్ అనేది ఎక్కడ తగ్గలేదు. ఇక మరో మూడు రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రచారంలో చాలా బిజీగా తిరుగుతున్నాడు. ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా సరే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కి మద్దతు గా ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం అండగా నిలబడింది.

ఇక వీళ్ళతో పాటు నాని, తేజ సజ్జ, రాజ్ తరుణ్, జబర్దస్త్ ఆర్టిస్టులందరూ కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా వస్తున్నారు. ఇక వీళ్లంతా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం లో తిరుగుతూ ఆయన్ని గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు…