Balakrishna: నందమూరి నటసింహం అయిన బాలయ్య బాబు చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బాలయ్య ఆయన సినిమాల ద్వారా మాస్ లో మంచి ఫాలోయింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అలాంటి ఆ ఫాలోయింగ్ వల్లే ఆయన ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. మధ్యలో బాలయ్య కి చాలా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ తనకున్న మాస్ ఫాలోయింగ్ తో ఆయన ఇన్ని రోజుల పాటు ఇండస్ట్రీలో తన మనుగడిని కొనసాగించాడు.
అయితే మాస్ ఆడియన్స్ ఫ్యాన్స్ గా ఉండటం వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ లు వచ్చినా కూడా అది హీరో కెరియర్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. అందువల్లే బాలయ్య బాబుకి కూడా కొద్ది సంవత్సరాలు పాటు ప్లాప్ లు వచ్చిన కూడా ఆయన స్టార్ హీరో గానే కొనసాగాడు. ఇక ఇది ఇలా ఉంటే బాలయ్య చేసిన సూపర్ హిట్ సినిమాల మధ్య కామన్ పాయింట్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా లాంటి సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అనేవి చాలా హైలైట్ గా నిలిచాయి.
బాలయ్య బాబు చేసిన సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. దానివల్ల ఆయన గురించి ముందుగా ఒక ఎలివేషన్ ఇచ్చి, ఆ తర్వాత దానికి తగ్గట్టుగానే ఆయన క్యారెక్టర్ ను పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన ఒక నాయకుడిగా ఎదగడం మనం చూస్తూనే ఉన్నాం..ఇక ఆయన చేసిన సినిమాలు చూడడానికి ప్రేక్షకులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.
కాబట్టి బాలయ్య బాబు సినిమాలు సక్సెస్ అవ్వాలంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తప్పకుండా ఉండాలి అనేంత రేంజ్ లో ఈ మూడు సినిమాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉండడం అవి సినిమాకి ఆయువు పట్టులా మారడం చూసిన ప్రతి ఒక్కరు బాలయ్య బాబు సినిమా హిట్ అవ్వాలంటే సినిమాలో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటో ఈజీగా చెప్పేస్తున్నారు. ఇక ఇప్పుడు బాబీ తో చేస్తున్న సినిమా కూడా ఒక పవర్ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది…