Hero Darshan: కన్నడ హీరో అయినా దర్శన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే హీరో దర్శన్. ఆయన సినిమాలు డబ్బింగ్ అవడంతో ఈయన తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఈయన చేసిన ఓ పని ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తన ప్రియురాలి కోసం తన వీరాభిమానిని చంపించాడు అనే అపవాదం మూటగట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
చిత్రదుర్గకు చెందిన 33 సంవత్సరాల రేణుకా గౌడ మెడికల్ షాపు ఉద్యోగిగా చేస్తున్నారు. దర్శన్ అంటే అతనికి చాలా అభిమానం కూడా. పవిత్ర వల్ల తన అభిమాన హీరో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆవేదన చెందాడు రేణుకా గౌడ. పవిత్ర గౌడకు అసభ్యరమైన మెసేజ్‌లు పంపాడు ఈయన. దీంతో అనవసరంగా గొడవలో ఇరుక్కున్నాడు అంటారు అభిమానులు. ఫలితంగా తన అభిమాన హీరోనే తనను చంపేయాల్సిందిగా హుకుం జారి చేసేలా చేసుకున్నాడనే టాక్ వచ్చింది.
ఇదెలా ఉంటే రేణుకా గౌడకు పెళ్లైంది. కుటుంబానికి అతనే పెద్ద దిక్కుగా ఉన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇదెలా ఉంటే దర్శన్ అరెస్ట్‌పై స్పందించడానికి నిరాకరించారు కర్నాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర. ఈవిషయంలో చట్టం తన పని తాను చేసుకునిపోతుందని కామెంట్లు చేశారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే అన్నారు పరమేశ్వర.