https://oktelugu.com/

Shruti Haasan: శృతి హాసన్ చేయలేనిది కోరిన ప్రియుడు… ఎట్టకేలకు బ్రేకప్ కి కారణం వెలుగులోకి!

ఏమైందో తెలియదు సడన్ గా బ్రేకప్ చెప్పుకున్నారు. మైఖేల్ కోసం శృతి హాసన్ కెరీర్ కూడా వదిలేసింది. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో 2017 నుండి ఆమె సినిమాలు చేయలేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 29, 2024 / 05:41 PM IST

    Shruti Haasan

    Follow us on

    Shruti Haasan: శృతి హాసన్ డేరింగ్ లేడీ. కెరీర్ బిగినింగ్ నుండి ఆమె ఓ ఇమేజ్ మైంటైన్ చేస్తుంది. పరిశ్రమకు వచ్చిన కొత్తల్లోనే వేశ్య వంటి బోల్డ్ రోల్స్ చేసింది. శృతి హాసన్ లైఫ్ స్టైల్ కూడా చాలా మోడ్రన్ గా ఉంటుంది. చెప్పాలంటే పాశ్చాత్య సంస్కృతి కి దగ్గరగా ఉంటుంది. పలువురు హీరోలతో ఆమె ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఓపెన్ గా ఆమె లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో డేటింగ్ చేసింది. చాలా కాలం మైఖేల్-శృతి హాసన్ కలిసి జీవించారు. ఎక్కడికెళ్లినా జంటగా వెళ్లేవారు. రెండు మూడు సందర్భాల్లో మైఖేల్ శృతి హాసన్ కుటుంబ సభ్యులను కలిశాడు. చెన్నై వచ్చి తమిళ సాంప్రదాయ బట్టల్లో మెరిశాడు.

    ఏమైందో తెలియదు సడన్ గా బ్రేకప్ చెప్పుకున్నారు. మైఖేల్ కోసం శృతి హాసన్ కెరీర్ కూడా వదిలేసింది. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో 2017 నుండి ఆమె సినిమాలు చేయలేదు. 2019లో మైఖేల్ తో బ్రేకప్ కాగా లండన్ నుండి తిరిగి ఇండియాకు వచ్చేసింది. కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అనంతరం ముంబై డూడుల్ ఆర్టిస్ట్ కి దగ్గరైంది. అతని పేరు శాంతను హజారిక. ఇద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేశారు.

    శాంతనుతో తన రిలేషన్ బహిరంగంగానే సాగించింది శృతి హాసన్. అతనితో గడిపిన ప్రతి క్షణాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఇంస్టాగ్రామ్ లో వందల ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. మూడేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ కలిసున్నారు. ఇటీవల అతనికి కూడా బ్రేకప్ చెప్పింది. ఇంస్టాగ్రామ్ నుండి శాంతను ఫోటోలు డిలీట్ చేసింది. అతనితో తన జ్ఞాపకాలు చెరిపేసింది. దాంతో బ్రేకప్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియా చాట్ లో తాను సింగిల్ అని చెప్పడం ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చింది.

    అయితే శాంతను కి శృతి హాసన్ బ్రేకప్ చెప్పడానికి కారణం… ఓ విషయంలో అతడు బలవంతం చేశాడట. పెళ్లి చేసుకోవాలని శాంతను కోరాడట. అందుకు శృతి హాసన్ ససేమిరా అందట. అయినప్పటికీ శాంతను వివాహం విషయంలో శృతి హాసన్ పై ఒత్తిడి తెచ్చాడట. దాంతో శృతి హాసన్ అతడితో బంధం తెంచుకుందట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో శృతి హాసన్ పెళ్లి అంటే నాకు భయం అని చెప్పింది. ఆమె ఓల్డ్ కామెంట్స్ ప్రస్తుత బ్రేకప్ రూమర్స్ కి బలం చేకూర్చుతున్నాయి.