Homeఎంటర్టైన్మెంట్Akhanda: 'అఖండ' సినిమా రన్ టైం ఎంతో తెలుసా?

Akhanda: ‘అఖండ’ సినిమా రన్ టైం ఎంతో తెలుసా?

Akhanda: నందమూరి నటసింహం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అఖండ.ఈ ఏడాది డిసెంబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 27న ఏర్పాటు చేయనున్నారట. ఈ వెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాచురల్ స్టార్ నాని వేదికను అలరించనున్నారని సినీ వర్గాలలో సమాచారం .

 Akhanda

కాగా, 12 రోజులలో విడుదల కాబోతున్న ఈ చిత్రాం ముందుగానే సెన్సార్ కూడా పూర్తి చేశారు. ముందుగానే అంచనా వేసినట్లు అఖండ సినిమాకు యు /ఏ సర్టిఫికెట్ వచ్చింది. బోయపాటి సినిమాలంటే చెప్పనక్కర్లేదు. కాస్త హింసతో కూడి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రన్ టైం ఎంత అన్న సమాచారం కూడా బయటికి వచ్చింది. అటు ఇటు గా 2 గంటల 37 నిమిషాలతో ఫైనల్ కట్ రెడీ చేశాడట బోయపాటి.

అయితే ఈ సినిమాలో 45 నిమిషాల పాటు యాక్షన్ ఘట్టాలే సాగుతాయని యూనిట్ వర్గాల సమాచారం. బాహుబలి’ తర్వాత అత్యధిక రోజులు యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు నెలకొల్పినట్లు ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్ చూసిన తర్వాత కాస్త అటూ ఇటుగా లెజెండ్ సినిమా గుర్తు చేస్తుంది చూడాలి మరి బోయపాటి ఏ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అనేది తెలియాలంటే వచ్చే నెల డిసెంబర్ 2 వరకు ఆగాల్సిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version