john abraham: ప్రస్తుతం బాలీవుడ్ టాప్‌హీరోల్లో ఒకరిగా దూసుకెళ్లిపోతున్న వారిలో జాన్ అబ్రహం ఒకరు. ఈ కండల వీరుడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అతను సినిమాల్లో చేసే స్టంట్లు అతనికి ఎనలేని అభిమానాన్ని తెచ్చిపెట్టాయి. చాలా మంది అతన్ని కలిసి, ఒక్క సెల్ఫీ అయినా దిగాలని ఆరాటపడుతుంటారు. అలాంటి హీరో రోడ్డుమీద నడుస్తూ కనిపిస్తే.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
https://www.instagram.com/tv/CWY0LLuhRAY/?utm_source=ig_web_copy_link
తాడాగా, ఉదయం రోజూలాగే జాగింగ్ వెళ్లారు అబ్రహం. అయితే, రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా.. ఇద్దరు అభిమానులు ఆయన్ని గుర్తుపట్టి.. బైక్‌పై కూర్చొని సెల్ఫీ వీడియో తీశారు. అంతలోనే జాన్ అబ్రహం వాళ్ల దగ్గరకు వచ్చి.. వాళ్ల చేతుల్లోని మొబైల్‌ను లాక్కున్నాడు. అంతరం ఫోన్ కెమెరా తనవైపు తిప్పి.. హాయ్ బాయ్స్.. ఇప్పుడు ఓకేనా?.. అంటూ సరదాగా నవ్వుతూ ఆటపట్టించారు. అయితే, ఆ యువకులకు తిరిగి మొబైల్ ఇచ్చేశారు జాన్.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ స్టార్ హీరో చాలా సరదాగా, సింప్లిసిటీగా ఉండటాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అసలు గర్వం లేకుండా ప్రవర్తించారని అన్నారు.
ప్రస్తుతం ముంబై సాగా సినిమాలో అబ్రహం నటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదలై మంచి హిట్ అందుకుంది. కాగా, తాజాగా సత్యమేవ జయతే 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. దివ్యాఖోస్లా కుమార్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. నోరా ఫతేహి ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. మిలాప్ జవేరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే విడుదలై సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.