Allu Arjun
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 2021లో విడుదలైన పుష్ప బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ చిత్రంలోని నటనకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నాడు . పుష్ప సీక్వెల్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదల కానుంది. ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది.
అనంతరం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఇక అల్లు అర్జున్ ప్రొఫెషనల్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ లోకి తగు సమయం కేటాయిస్తారు. ముఖ్యంగా ఆయన స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యంటే అల్లు అర్జున్ కి అమితమైన ప్రేమ. కాగా అల్లు అర్జున్ ఆమెను ఓ ముద్దు పేరుతో పిలుచుకుంటారట. సెలబ్రెటీలు అన్నాక ఇలా నిక్ నేమ్స్ తో పిలుచుకోవడం చాలా కామన్.
అల్లు అర్జున్ కి కూడా నిక్ నేమ్ ఉంది. సన్నిహితులు, అభిమానులు ఆయన్ని బన్నీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డిని క్యూటీ అని పిలుస్తారట. వారి సన్నిహితుల సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. అల్లు స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. భర్త, పిల్లల కి సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అంతే కాదు స్నేహ రెడ్డి బిజినెస్ లో కూడా రాణిస్తుంది. అల్లు అర్జున్ కి సంబంధించిన పలు బిజినెస్ లు చూసుకుంటుంది. కాగా వీరికి ఇద్దరు పిల్లలు .. అయాన్, అర్హ లు. అర్హ ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం తో బాల నటిగా పరిచయం అయింది. ఇందులో భరతుడి పాత్రలో నటించింది. అల్లు అర్జున్ తరచు తన గారాల పట్టి అర్హ తో ఆడుకుంటూ పలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.