Allu Arjun: అల్లు అర్జున్ ను టైర్ వన్ హీరోగా మార్చిన ఆ రెండు సినిమాలు ఇవే…

ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి బాలీవుడ్ లో తను పాగా వేయాలని చూస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : June 23, 2024 1:38 pm

Allu Arjun

Follow us on

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్..గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయినప్పటికీ ఆయనకు హీరోగా మాత్రం ఆఫర్స్ అయితే రాలేదు. ఇక ఆ తర్వాత ఆర్యతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు.

ఇక దాంతో ఓవర్ నైట్ లో అల్లు అర్జున్ పేరు ఇండస్ట్రీ లో మారుప్రోగిపోయిందనే చెప్పాలి. ఇక ఆ రకంగా ఆయన వరుస విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కూడా కొనసాగాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన మీడియం రేంజ్ హీరోగా కొనసాగుతున్న సమయంలో అలా వైకుంఠపురం లో అనే సినిమాతో ఒక్కసారిగా ఆయన టైర్ వన్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ తర్వాత పుష్ప సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి బాలీవుడ్ లో తను పాగా వేయాలని చూస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా కొనసాగుతున్నప్పటికీ తొందర్లోనే ఈ సినిమాని రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని కూడా సాధించాలని చూస్తున్నాడు.

ఇక తన ఎంటైర్ కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలు చాలా వరకు ఉన్నప్పటికీ బ్యాక్ టు బ్యాక్ అలా వైకుంఠపురంలో, పుష్ప లాంటి సినిమాలు రాలేదు. అందువల్లే ఆయన ఒక్కసారిగా స్టార్ హీరోగా మారడమే కాకుండా పుష్ప సినిమాతో ‘నేషనల్ అవార్డు’ ని కూడా గెలుచుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు…ఇక ఇప్పుడు మరోసారి పుష్ప 2 తో భారీ సక్సెస్ కొట్టడమే లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…