Devara Fear Song
Devara Fear Song: ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ దేవర. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దేవర చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కాగా ఒకరోజు ముందు 19న దేవర నుండి ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. ఫియర్ సాంగ్ పేరుతో యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చిన ఈ పాట విశేష ఆదరణ పొందుతుంది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.
దేవర ఫియర్ సాంగ్ విడుదల దాదాపు రెండు వారాలు అవుతుంది. అప్పుడే 70 మిలియన్ వ్యూస్ అందుకుంది. అలాగే టాప్ లో ట్రెండ్ అవుతుంది. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆయన అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. ఎన్టీఆర్ ఫెరోషియస్ నేచర్ ని తెలియజేసేలా రౌద్రంగా సాగింది ఈ పాట. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.
అనిరుధ్ స్వయంగా ఈ సాంగ్ పాడారు. అనిరుధ్ పై స్పెషల్ వీడియో కూడా షూట్ చేశారు. మొదటి సాంగ్ తోనే దేవర మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు మేకర్స్. ఫియర్ సాంగ్ కి భారీ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఓ పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుందట. శత్రువుల రక్తంతో కెరటాలను ఎరుపెక్కిస్తాడట ఎన్టీఆర్.
ఇక ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటించడం విశేషం. శ్రీదేవి వారసురాలు ఎన్టీఆర్ మూవీతో సౌత్ లో అడుగుపెడుతుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. శ్రీకాంత్ మరొక కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవర చిత్రం పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫ్యాన్స్ మూవీ విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
The rage of #Devara looks unstoppable with his FIERY STORM #FearSong has everyone hooked with over + and ❤️❤️
An @anirudhofficial Musical
Man of Masses @tarak9999 ❤️ pic.twitter.com/2ngzSmDLRM
— Devara (@DevaraMovie) May 31, 2024
Web Title: Do you know how many crore people have seen devara fear song
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com