Ravi Teja: బాక్సాఫీస్ దగ్గర రవితేజ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు…

Ravi Teja: రవితేజ ను మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే గతంలో ఆయన్ని తక్కువ అంచనా ప్రతిసారి భారీ సక్సెస్ తో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు.

Written By: Gopi, Updated On : June 19, 2024 1:44 pm

Ravi Teja cannot be underestimated at the box office

Follow us on

Ravi Teja: మాస్ మహారాజా గా తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో రవితేజ… ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కు సంభందించిన యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడిన షో రీల్ అనే పేరుతో ఒక టీజర్ ను అయితే రిలీజ్ చేశారు.

అయితే ఈ టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేయడంతో హరీష్ శంకర్ ఈ సినిమాని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇంతకుముందు రవితేజ కి వరుసగా మూడు ప్లాప్ లు రావడంతో ఇప్పుడు ఈ సినిమాతో తనను తాను మరొకసారి ఎలాగైనా స్టార్ హీరో గా ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రవితేజ ను మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే గతంలో ఆయన్ని తక్కువ అంచనా ప్రతిసారి భారీ సక్సెస్ తో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.

Also Read: Akhil: ఏ వారసుడికి జరగని ఘోర అవమానం అఖిల్ కే జరుగుతుందా..? ఎందుకిలా అవుతుంది..?

ఇక మొత్తానికైతే ఇప్పుడు రవితేజ ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటేనే తన మార్కెట్ భారీగా ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే మాత్రం మార్కెట్ అనేది భారీగా తగ్గి ఆయన సినిమాలు ఎక్కువగా బిజినెస్ చేసే అవకాశాలైతే ఉండవు. కాబట్టి ఈ సినిమాతో తను ఎలాగైనా సక్సెస్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: Breaking News: చిరంజీవి మాజీ అల్లుడు మృతి… తండ్రిని కోల్పోయిన శ్రీజ కూతురు!

ఇక హరీష్ శంకర్ కూడా ఇంతకు ముందు చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ అయితే సాధించడం లేదు. గబ్బర్ సింగ్ తర్వాత ఆయన చేసిన ఏ సినిమా కూడా అంత పెద్ద విజయాన్ని సాధించకపోవడంతో ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు…ఇక ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ తో తను బిజీ కానున్నాడు..