https://oktelugu.com/

Akhanda Movie: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి…

Akhanda Movie: నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ హీరో బోయపాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం అఖండ‌. కాగ బాల‌కృష్ణ, బోయ‌పాటి కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీ గా వ‌స్తున్న చిత్రం కావ‌డం తో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కాగ ఈ సినిమాలో హీరో శ్రీ‌కాంత్ విలన్ గా న‌టిస్తున్నాడు. అలానే ప్ర‌గ్యా జైస్వాల్ బాలయ్యకు జోడీగా నటించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం హైద‌రాబాద్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 27, 2021 / 09:02 AM IST
    Follow us on

    Akhanda Movie: నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ హీరో బోయపాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం అఖండ‌. కాగ బాల‌కృష్ణ, బోయ‌పాటి కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీ గా వ‌స్తున్న చిత్రం కావ‌డం తో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కాగ ఈ సినిమాలో హీరో శ్రీ‌కాంత్ విలన్ గా న‌టిస్తున్నాడు. అలానే ప్ర‌గ్యా జైస్వాల్ బాలయ్యకు జోడీగా నటించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం హైద‌రాబాద్ లో ని శిల్ప క‌ళా వేదికలో జరగనుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెష‌ల్ గెస్ట్ గా స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి వ‌స్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

    Akhanda Movie Pre Release Event

    Also Read: Marakkar: డిసెంబరు 3న థియేటర్లలో అడుగుపెట్టనున్న సముద్ర సింహం

    ఈ విష‌యాన్ని సోషల్ మీడియా వేదికగా మూవీ యూనిట్ తెలియజేశారు. ఇటీవల ఈ ఈవెంట్ కు మరో అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హాజ‌రు కాబోతున్నారు అని ప్రకటించిన విశయం తెలిసిందే. ఈ ఫంక్షన్ కు ముందుగా ఎన్టీఆర్ తో పాటు నేచుర‌ల్ స్టార్ నాని అతిధులుగా హాజరవుతారని అంద‌రూ భావించారు. అయితే ఇప్పుడు అందరూ ఊహలకు అందకుండా రాజమౌళి, అల్లు అర్జున్ హాజరవుతుండడం విశేషం అని చెప్పాలి. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా జగపతి బాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Also Read: KS Nageswararao: టాలీవుడ్​లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి