Srihari: అర్థరాత్రి ఫోన్ వస్తే ఆ కుటుంబాన్ని కాపాడటానికి వెళ్లిన శ్రీహరి..అసలు స్టోరీ ఏంటంటే..?

మొదట సినిమా ఇండస్ట్రీకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీహరి చాలా తక్కువ సమయంలోనే హీరోగా మారి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనదైన సేవలను అందిస్తూ ముందుకు సాగాడు.

Written By: Gopi, Updated On : April 25, 2024 12:21 pm

Srihari

Follow us on

Srihari: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన నటనను కనబరిచి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. అందులో రియల్ స్టార్ శ్రీహరి ఒకరు..మొదట సినిమా ఇండస్ట్రీకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీహరి చాలా తక్కువ సమయంలోనే హీరోగా మారి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనదైన సేవలను అందిస్తూ ముందుకు సాగాడు. చాలా చిన్న ఏజ్ లోనే ఆయన మరణించడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.

ఎందుకంటే ఆయన ఏ రకమైన పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు కావడం విశేషం… అందువల్లే ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. ఇక ఇలాంటి క్రమంలోనే అప్పట్లో ఎప్పుడు ఆయనతోనే ఉండే డైరక్టర్ బాబీ శ్రీహరి గారి గొప్పతనం గురించి ఒక ఈవెంట్ లో చాలా గొప్పగా చెప్పాడు. శ్రీహరి గారి దగ్గర ఎప్పుడు రెండు ఫోన్లు ఉంటాయని ఒకటి సినిమాకి, పర్సనల్ వ్యవహారాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ కోసం కాగా, మరొకటి పబ్లిక్ వ్యవహారాలను చూసుకునే ఫోన్ గా తెలియజేశాడు. అంటే ఎవరైనా ఏదైనా ఆపద ఉందని చెబితే ఆ ప్రాబ్లం ను సాల్వ్ చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఇక తన ఫోన్ కి ఏదైనా కాల్ వచ్చిందంటే దానికి చాలా తొందరగా రెస్పాండ్ అవుతూ ఉంటారు.

ఇక అందులో భాగంగానే ఒక ఫ్యామిలీ షిరిడికి వెళ్లి బస్సులో వస్తున్న నేపథ్యంలో కొందరు ఆకతాయిలు మద్యం సేవించి వాళ్ల కుటుంబాన్ని టీజ్ చేశారని. అయితే ఆ వ్యక్తికి ఒక భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇక ఆయనకు ఏం చేయాలో తెలియక అప్పటికే తన ఫోన్లో ఎవరో చెబితే శ్రీహరి నెంబర్ ఫీడ్ చేసుకొని ఉన్నాడట. ఇక దాంతో శ్రీహరికి నైట్ ఒకట్టింటికి కి ఫోన్ చేసి భయంతో అతను ఏదో చెబుతున్నాడట. ఇక అది శ్రీహరికి అర్థం కాక ఏ ఫోన్ చేసావ్, ఏం కావాలో చెప్పు అని గట్టిగా అడగడంతో ఆ వ్యక్తి నేను ఇలా షిరిడి నుంచి వస్తున్నాను. బస్సు లో ఉన్నాను కొందరు ఆకతాయిలు నన్ను నా ఫ్యామిలీ ని టీజ్ చేస్తున్నారు. నేను కొంచెం గట్టిగా మాట్లాడేసరికి హైదరాబాద్ వచ్చిన తర్వాత నీ అంత చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు అని ఏడుస్తూ చెప్పాడట. దాంతో శ్రీహరి నువ్వు షిరిడీకి వెళ్లి వస్తున్నావు కాబట్టి వాళ్ళని ఏమీ అనకు మార్నింగ్ మనవాళ్ళు వస్తారు. నిన్ను సేఫ్ గా ఇంటికి చేరుస్తారని చెప్పాడట. ఇక దాంతో ఆ ఫ్యామిలీ అంతా శ్రీహరి మీద అండతో చాలా ధైర్యంగా ఉన్నారట. ఇక పొద్దున ఐదున్నర కి బస్సు ఎస్సార్ నగర్ రాగానే ఆ వ్యక్తి శ్రీహరికి ఫోన్ చేసి సార్ మేము ఇలా ఎస్సార్ నగర్ వచ్చాము మన మనుషులు వచ్చారా అని అడగడంతో నువ్వు ముందు బస్సు దిగు అని శ్రీహరి అన్నాడట. ఇక దాంతో ఆ ఫ్యామిలీ మొత్తం బస్సు దిగగానే ఎదురుగా టీ షర్ట్ వేసుకొని, లుంగీ కట్టుకొని నిద్రమత్తులో ఉన్న శ్రీహరి ఉండటం ఆ ఫ్యామిలీ శ్రీహరిని చూసి చాలా గర్వంగా ఫీల్ అవ్వడం, వాళ్ల బాధలు చెప్పుకోవడంతో శ్రీహరి వాళ్ల కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇచ్చాడట.

ఇక వాళ్ళ ఫ్యామిలీని సేఫ్ గా వాళ్ళ ఇంటికి చేర్చాడు. అప్పుడు బాబీ శ్రీహరి పక్కనే ఉండి ఇదంతా చూశాడట. ఇక ఇది ఒకటనే కాదు శ్రీహరి ఇలాంటి సహాయాలు చాలామందికి చేశారని బాబీ ఆ ఈవెంట్లో చెప్పడం శ్రీహరి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇక శ్రీహరి హీరోగా మల్లికార్జున డైరెక్షన్ లో వచ్చిన ‘భద్రాద్రి ‘ సినిమాకి బాబీ కథను అందించాడు… ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోయిన శ్రీహరికి, బాబీకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది…