Jai Hanuman: జై హనుమాన్ సినిమాలో హనుమాన్ గా నటిస్తున్న స్టార్ హీరో…

ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం హనుమాన్ పాత్రని రామ్ చరణ్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వర్థలైతే వస్తున్నాయి. రామ్ చరణ్ లాంటి నటుడు అలాంటి పాత్రను పోషిస్తే నిజంగా ఆ పాత్రకి ఉన్న ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. అలాగే సినిమా మీద అంచనాలు కూడా తారస్థాయిలోకి వెళ్తాయి.

Written By: Gopi, Updated On : July 7, 2024 4:14 pm

Jai Hanuman

Follow us on

Jai Hanuman: యంగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్ ‘ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 50 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ సినిమా క్రియేట్ చేయలేని రికార్డులను కూడా ఈ సినిమా క్రియేట్ చేసింది. ఒక చిన్న సినిమాకి అన్ని వందల కోట్ల కలెక్షన్స్ రావటం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటుగా ఆయన ఈ సినిమాకి సీక్వెల్ని కూడా తీస్తానని ప్రకటించాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సీక్వెల్ కి సంబంధించిన షూట్ జరుగుతుంది. ఇక ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తను మరోసారి పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాలని చూస్తున్నాడు. ఇక జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర చాలా కీలకంగా మారబోతుంది. కాబట్టి ఆ పాత్రను ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు చాలా ఉత్సాహన్ని చూపిస్తున్నారు.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం హనుమాన్ పాత్రని రామ్ చరణ్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వర్థలైతే వస్తున్నాయి. రామ్ చరణ్ లాంటి నటుడు అలాంటి పాత్రను పోషిస్తే నిజంగా ఆ పాత్రకి ఉన్న ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. అలాగే సినిమా మీద అంచనాలు కూడా తారస్థాయిలోకి వెళ్తాయి.

ఫైనల్ గా కలెక్షన్స్ కూడా అనుకున్న దానికంటే మరింత ఎక్కువ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి రామ్ చరణ్ ఈ పాత్ర చేస్తే ఈ సినిమా దశా దిశ మారిపోయినట్టేనని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా యూనిట్ మాత్రం ఇప్పటివరకు అఫీషియల్ గా ఈ న్యూస్ ని అనౌన్స్ చేయలేదు. మరి తొందర్లోనే ఈ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి…