Madanapalle: ఈమె కూతురు కాదు నరరూప రాక్షసి.. తన ఇద్దరు ప్రియులతో కలిసి తండ్రిని..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం దారుణం చోటు చేసుకుంది.. ఈ పట్టణంలో కురువంగ ఆంజనేయస్వామి గుడి సమీపంలో పోస్టల్ టెలికాం కాలనీ ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 15, 2024 3:36 pm

Madanapalle

Follow us on

Madanapalle: కూతురు అంటే తండ్రికి మరో అమ్మ లాంటిది. అందుకే తన బిడ్డకు చనువిస్తాడు. ఎంతైనా ఇస్తాడు.. ఏదైనా ఇస్తాడు. ఏం కావాలన్నా చేస్తాడు.. తన బిడ్డ వద్ద తను పసిపిల్లాడైపోతాడు. ఆమెను చూస్తూ మై మరచిపోతాడు. ఆమె ఎదుగుతుంటే మురిసిపోతాడు. ఆమె అత్తారింటికి వెళ్తుంటే కన్నీరు పెట్టుకుంటాడు. ఆమెకు ఏదైనా కష్టం వస్తే దిక్కులు పిక్కటిల్లే విధంగా రోదిస్తాడు.. తన బిడ్డలో తన తల్లిని చూసుకుంటాడు. తన బిడ్డ విషయంలో తగ్గుతాడు.. తలొగ్గుతాడు. అందుకే ఈ సృష్టిలో తండ్రి బిడ్డల మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనది.. అయితే కొన్నిచోట్ల దుర్మార్గులైన తండ్రులు ఉంటారు. పనికిమాలిన కూతుర్లు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఈ కూతురు కూడా అలాంటిదే. ఇంతకీ ఈమె ఏం చేసిందంటే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం దారుణం చోటు చేసుకుంది.. ఈ పట్టణంలో కురువంగ ఆంజనేయస్వామి గుడి సమీపంలో పోస్టల్ టెలికాం కాలనీ ఉంది. ఇందులో దొరస్వామి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు స్థానికంగా జిఆర్టి స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం దొరస్వామి భార్య స్నేహ చనిపోయింది. దొరస్వామి – స్నేహ దంపతులకు హరిత అనే పాతికేళ్ల కుమార్తె ఉంది.. భార్య స్నేహ చనిపోవడంతో హరితకు అమ్మానాన్న అన్నీ దొరస్వామే అయ్యాడు. హరిత స్థానికంగానే బిఎస్సి, బిఈడి పూర్తి చేసింది. దొరస్వామి మరికొద్ది రోజుల్లో పదవి విరమణ చేయబోతున్నాడు. పదవి విరమణ అనంతరం వచ్చిన డబ్బులతో తన కూతురి పెళ్లి చేయాలనే నిర్ణయించుకున్నాడు.

కుమార్తెకు పెళ్లి వయసు రావడంతో కుప్పం ప్రాంతంలో ఒక సంబంధం చూశాడు. వివాహ సమయంలో తన కూతురికి కట్నం కింద ఇచ్చేందుకు 80 లక్షల విలువైన రెండు అంతస్తుల భవనాన్ని కూడా కొనుగోలు చేశాడు.. దానిని తన బిడ్డ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. మరి కొద్ది రోజుల్లో కుమార్తెకు పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం దొరస్వామి చనిపోయాడు.. అతడు చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. దొరస్వామికి మద్యం తాగే అలవాటు ఉంది. అయితే బుధవారం కూడా అతడు మద్యం తాగి నిద్రపోయాడు. ఉదయం చూసేసరికి నెత్తుటి మడుగులో శవంలాగా కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలుపెట్టారు. సంఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు కూడా సేకరించారు.

దొరస్వామి బుధవారం మద్యం తాగి ఇంట్లో పడుకున్న సమయంలో కూతురు హరిత, అతడు మాత్రమే ఉన్నారు.. దీంతో పోలీసులు ముందుగా హరితను ప్రశ్నించారు.. “ఇంట్లోకి ఎవరో వచ్చారు. వారు మా నాన్నను హత్య చేశారు” అని చెప్పింది. అయితే ఆమె చెబుతున్న మాటలకు పొంతన లేకపోవడంతో పోలీసులు మరింత గుచ్చి గుచ్చి ఆమెను ప్రశ్నించారు.. చివరికి తానే తన తండ్రిని చంపానని ఆమె పోలీసుల ఎదుట ఒప్పుకుంది. తన తండ్రి తనపై లైంగికంగా దాడి చేస్తున్నాడని, అందువల్లే చంపానని ఆమె వివరించింది. అయినప్పటికీ ఆమె మాటలు స్పష్టంగా లేకపోవడంతో పోలీసులు మరింత లోతుగా ప్రశ్నించారు. దీంతో ఆమె అసలు నిజం ఒప్పుకుంది.

హరితకు విచ్చలవిడితనం ఎక్కువ. పైగా ఒక్కతే కూతురు కావడంతో స్వేచ్ఛ విపరీతంగా ఉండేది. ఏకకాలంలో హరిత ఇద్దరు ప్రియులతో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. ఒకరోజు ఒక ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.. అతనితో శారీరక సుఖం అనుభవించింది. అతడు వెళ్లిపోయిన తర్వాత మరొక ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది. అతడితోనో పీకల్లోతో సల్లాపాలలో మునిగిపోయింది. అయితే ఈ విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళు గమనించారు. సాయంత్రం దొరస్వామి రాగానే అతడి చెవిలో వేశారు. కుమార్తె వ్యవహారం గురించి తెలుసుకున్న దొరస్వామి బాధపడ్డాడు.. ఆమె జీవితం నాశనం కావద్దని నిర్ణయించుకొని, పెళ్లి చేయాలని భావించాడు. అయితే తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని హరిత తన తండ్రితో చెప్పింది. ఈ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి.. దీంతో తండ్రి పై కక్ష పెంచుకున్న హరిత తన ఇద్దరు ప్రేమికులను రంగంలోకి దింపింది. వారి సహాయంతో దొరస్వామిని చంపేసింది.

దొరస్వామిని చంపేందుకు హరిత ఒక ప్రియుడికి ఏకంగా 10 లక్షలు ఇచ్చింది. ఆ డబ్బులు ముట్టిన తర్వాతే అతడు దొరస్వామిని హత్య చేశాడు. అయితే హరిత ప్రేమికుల లో ఒకతను హత్య జరిగిన సమయంలో తిరుపతిలో ఉన్నాడు. ఇంకో ప్రేమికుడు ఎక్కడ ఉన్నాడనేది తెలియదు. అయితే అతడికే తాను 10 లక్షలు ఇచ్చి, తండ్రిని చంపించానని హరిత చెబుతోంది.. ముందుగా తన తండ్రిని కొట్టానని.. ఆ తర్వాత తన ప్రియుడు మిగతా వ్యవహారం పూర్తి చేశాడని హరిత వివరిస్తోంది. అయితే హత్య జరిగిన తీరు చూస్తే ఒక్కరు చేసింది కాదని, ఇందులో ముగ్గురు లేదా నలుగురు వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు అంటున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.