Double ISmart: ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లో పూరి ఈ ఒక్క విషయం మీద బాగా ఫోకస్ చేశాడా..?

కెరియర్ లో ఎన్నో కష్టాలను తట్టుకొని నిలబడి, పోరాడి మరి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న ఒకే ఒక ఘట్స్ ఉన్న తెలుగు డైరెక్టర్ పూరీ జగన్నాథ్...

Written By: Gopi, Updated On : August 5, 2024 8:25 am

Double ISmart

Follow us on

Double ISmart: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్…ప్రస్తుతం ఈయన రామ్ ను హీరోగా పెట్టి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ఇక ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కి ముస్తాబ్ అవుతున్న సమయం లో ట్రైలర్ తో ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు పెంచడానికి పూరి జగన్నాథ్ భారీ ప్రణాళికనైతే రూపొందించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ప్రస్తుతం పూరి జగన్నాథ్ అంత మంచి ఫామ్ లో లేడనే విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఆయన మరోసారి తన ఫామ్ ని తిరిగి తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చాలా రిచ్ గా తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొదటి పార్ట్ ఎంత మంచి సక్సెస్ ని సాధించిందో దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ని అందుకుంటుందంటూ సినిమా యూనిట్ తో పాటు ప్రేక్షకులు కూడా చాలా వరకు మంచి అంచనాలనైతే పెట్టుకున్నారు.

ఇక ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ లో రామ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించడమే కాకుండా సినిమా ప్లాట్ ని కూడా రివిల్ చేశారు. సంజయ్ దత్ బ్రెయిన్ ని రామ్ బ్రెయిన్ లోకి ఎక్కించి ఆ తర్వాత ఏం చేయబోతున్నారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ గా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే భారీ సక్సెస్ ని కనక కొట్టినట్టైతే రామ్ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా గుర్తింపును తెచ్చుకుంటాడు… ఇక ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ లో ఒక హిట్టు వైబ్ అయితే కనిపిస్తుంది.

ఇక ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా ఇంతకు ముందు పూరి సినిమాల్లో ఎలాంటి ఒక స్టైలిష్ నెస్ అయితే ఉండేదో ఈ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. అలాగే పూరి ఈ సినిమాతో పక్కగా సక్సెస్ ను కొట్టబోతున్నాడు అనే కాన్ఫిడెంట్ కూడా ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. ఇక ‘పూరి ఇస్ బ్యాక్’ అంటూ కూడా ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే పూరి ఈ ట్రైలర్ మొత్తంలో తన మేకింగ్ హైలెట్ అయ్యే విధంగా, తన మార్క్ కనిపించే విధంగా చూపించారు…ఇక మొత్తానికైతే ఆయన అనుకున్న సక్సెస్ ని ఈ సినిమాతో సాధిస్తాడా? లైగర్ సినిమాతో ఎలాంటి పరాభవాన్ని అయితే చవి చూశాడో అదే బాలీవుడ్ గడ్డ పైన ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ కొట్టి అక్కడి ప్రేక్షకులతో పూరి గ్రేట్ డైరెక్టర్ అని పిలిపించుకుంటాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…