Double Ismart Vs Mr Bachchan: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సోలోగా ఎంట్రీ ఇచ్చిన రవితేజ ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకడిగా వెలుగుందుతున్నాడు. ఇక ఇప్పటికి ఈయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక అదేవిధంగా ఆగస్టు 15వ తేదీన ఆయన చేసిన ‘మిస్టర్ బచ్చన్ ‘ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ క్రమంలోనే ఆయన ఈ సినిమా మీద భారీ ఆశాలైతే పెట్టుకున్నాడు. ఇక ఇంతకుముందు ఆయన చేసిన నాలుగు సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో హరీష్ శంకర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ ను నమ్ముకొని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ మూవీ మీద ఇప్పటివరకు ఎలాంటి అంచనాలైతే లేవు. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది… దీనికి పోటీగా ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న రామ్ పోతినేని రంగంలోకి దిగుతున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఈయన చేసిన ‘డబుల్ ఇస్మార్ట్ ‘ అనే సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. నిజానికి డబుల్ ఇస్మార్ట్ మీద కూడా మంచి అంచనాలు అయితే లేవు. మరి రిలీజ్ కి మరొక 10 రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ ఈ రెండు సినిమాల దర్శకులు ప్రమోషన్స్ ను పెంచాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పుడున్న బజ్ ప్రకారం అయితే ఈ సినిమాలకు భారీ కలెక్షన్స్ ను వసూలు చేయడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఈ పది రోజుల్లో కనక వాళ్ళు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ఏర్పాటు చేసి సినిమా మీద హైప్ ని తీసుకొస్తే ఈ రెండు సినిమాలు కూడా మంచి ఓపెనింగ్స్ ను సాధిస్తాయి. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న వేళ ఆ సినిమాకి ఇండియా వైడ్ గా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా ఓన్లీ తెలుగుకు మాత్రమే పరిమితమైంది.
కాబట్టి ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ అయితే దక్కుతాయి…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అయిన పూరి జగన్నాథ్ అలాగే ‘మిస్టర్ బచ్చన్’ సినిమా దర్శకుడు అయిన హరీష్ శంకర్ ఇద్దరు కూడా గురు శిష్యులు కావడం విశేషం…ఇక వీళ్ళిద్దరూ కూడా కమర్షియల్ డైరెక్టర్లు మాత్రమే కాకుండా గురు శిష్యులుగా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు సక్సెస్ ని అందుకొని బాక్సాఫీస్ దగ్గర వాళ్ల స్టామినాను ప్రూవ్ చేసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక ప్రమోషన్స్ ని వేగవంతం చేసే సమయం అయితే ఆసన్నమైంది. మరి ఇద్దరీ సినిమాల పట్ల బజ్ అయితే క్రియేట్ చేయడానికి ఎవరు ఎలాంటి స్ట్రాటజీని వాడుతారు అనేదే తెలియాల్సి ఉంది… ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకులు ఎలాగైనా సరే సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నారు. ఇక వీళ్లిద్దరూ టాప్ హీరోలతో సినిమాలు చేయాలంటే ఈ సినిమాల సక్సెసులు అనేవి చాలా కీలకంగా మారబోతున్నాయి…