Chiranjeevi: చిరంజీవి సినిమాల్లో ఈ రెండు సినిమాల స్టోరీ ఒకటే అని మీకు తెలుసా..?

జనరేషన్ కి తగ్గట్టుగా తనని తాను మౌల్డ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు ఏ ఒక్కరికి బోర్ కొట్టకుండా చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు.

Written By: Gopi, Updated On : February 15, 2024 10:16 am
Follow us on

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి తనదైన రీతిలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. దాదాపు 40 సంవత్సరాలపాటు ఒక్కడే ఇండస్ట్రీ ని శాశిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయనను ఢీకొట్టే హీరో ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇంకా రాలేదనే చెప్పాలి. కమర్షియల్ సినిమాలను తీయడంలో చిరంజీవి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేశాడు. దాన్ని క్రాస్ చేసే హీరోలు ఎవరు కనిపించడం లేదు. నిజానికి ఆయనలో ఉన్న గ్రేస్ కానీ, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ గాని, ఆయన డాన్స్ చేసినప్పుడు ఆయనలో కనిపించిన స్పీడ్ గాని చాలా కొత్తగా ఉంటాయి.

ఆయన జనరేషన్ కి తగ్గట్టుగా తనని తాను మౌల్డ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు ఏ ఒక్కరికి బోర్ కొట్టకుండా చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. అలాగే యాక్టింగ్ లోను చాలా పరిణితిని చూపిస్తూ ఎప్పటికప్పుడు జనరేషన్ కి తగ్గట్టుగా తనని తాను చేంజ్ చేసుకుంటూ వస్తాడు. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి హీరోగా వచ్చిన రెండు సినిమాల స్టోరీ లు ఒకటిగానే ఉంటాయి అవి ఏ సినిమాలు అంటే చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ‘ మాస్టర్ ‘…

అలాగే గుణశేఖర్ దర్శకత్వం లో వచ్చిన ‘చూడాలని ఉంది ‘ ఈ రెండు సినిమాల స్టోరీలు దాదాపు సిమిలర్ గా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాలు కూడా అప్పట్లో పెను సంచలనాలను సృష్టించాయనే చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాలను చూసిన అభిమానులు చిరంజీవి నటనకు ఫిదా అయిపోయారు. ఇక ఇవి రెండు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక వీటిలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఈ సినిమాలకి హైలైట్ గా నిలిచాయి. అందువల్లే ఈ సినిమాలు చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాలు గా మిగిలిపోయాయి.

అందుకే ఒక సినిమాను తెరకెక్కించి సక్సెస్ కొట్టడానికి చిరంజీవి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన అల్టిమేట్ గోల్ సక్సెస్. దానివల్లే సినిమాని సక్సెస్ చేయడానికి ఎన్ని ఎలిమెంట్స్ ని వాడాలో అన్నింటినీ రైటర్ల చేత స్టోరీ లో ఆడ్ చేయిస్తూ ఉంటాడు. అందువల్ల ఇప్పటికి కూడా చిరంజీవి ఒక సక్సెస్ ఫుల్ హీరో గానే కొనసాగుతున్నాడు…