This Week Release Movies: మొత్తమ్మీద ఈ వారం కూడా భారీ సినిమా పుష్ప రిలీజ్ కాబోతుంది. బాక్సాఫీస్ పై యుద్దానికి అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని బాగానే సిద్ధం చేస్తున్నాడు. పైగా అల్లు అర్జున్ కి ఇది ప్రతిష్టాత్మక సినిమా కూడా. బన్నీ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అందుకే, పుష్ప పై బన్నీ ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు పుష్పకి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఈ సినిమా ఇతర భాషల్లోనూ హిట్ అయితేనే.. అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ వస్తోంది. ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. కాకపోతే, పాన్ ఇండియా లెవెల్ లో విజయం సాధించడం అంత సులభం కాదు. తెలుగులో హిట్ అయిన చిత్రాలు కూడా ఇతర భాషల్లో ఉసూరుమనిపిస్తాయి.
దానికి కారణం.. కథ, నేటివిటీ, కాస్టింగ్, మేకింగ్ వంటి అనేక కారణాలు ఉంటాయి. అందుకే, ఎక్కువగా మన చిత్రాలు జాతీయస్థాయిలో సత్తా చాట లేవు. అందులో భాగంగా పుష్పకి ఇతర భాషల్లో భారీ వసూళ్లు రావడం కష్టం అనే కోణం కనిపిస్తుంది.
ఇక మరో భారీ సినిమా ‘స్పైడర్ మ్యాన్’ జాన్ వాట్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హాలీవుడ్ సూపర్ హీరో సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూమిని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువులు ఎవరు? వారిని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు ? అనే కోణంలో ఈ సినిమా కథ నడుస్తోంది. అందుకే, మాస్ ఆడియన్స్ తో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
ఆహా
రాజ్ తరుణ్ కథానాయకుడిగా వచ్చిన సినిమా ‘అనుభవించు రాజా’. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో డిసెంబరు 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీ లివ్
ది విజిల్ బ్లోయర్ (హిందీ సిరీస్) డిసెంబరు 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read: Radhe Shyam: “రాధేశ్యామ్” సినిమాకి జపనీస్ ఫ్రీ పబ్లిసిటీ
నెట్‌ఫ్లిక్స్
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ (హాలీవుడ్) డిసెంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ది విచ్చర్ (వెబ్ సిరీస్) డిసెంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
కడశీల బిర్యాని (తమిళ్) డిసెంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
జీ5
420 ఐపీసీ(హిందీ) డిసెంబరు 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.