https://oktelugu.com/

Bigg Boss: ఆరో వారంలో ‘బిగ్ బాస్’ ట్వీస్ట్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

Bigg Boss OTT Telugu: బుల్లితెరపై రియల్టీ షోలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ షోగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తొలి సీజన్ నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ప్రతీయేటా ఓ సీజన్ తో సందడి చేస్తోంది. బుల్లితెరపై ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం ఓటీటీలోనూ తన మార్క్ ఎంటటైన్మెంట్ అందిస్తోంది. ‘బిగ్ బాస్’ ఓటీటీ తొలి సీజన్ ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరోవారంలో కొనసాగుతోంది. గడిచిన […]

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2022 / 01:58 PM IST
    Follow us on

    Bigg Boss OTT Telugu: బుల్లితెరపై రియల్టీ షోలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ షోగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తొలి సీజన్ నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ప్రతీయేటా ఓ సీజన్ తో సందడి చేస్తోంది. బుల్లితెరపై ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం ఓటీటీలోనూ తన మార్క్ ఎంటటైన్మెంట్ అందిస్తోంది.

    Bigg Boss OTT Telugu

    ‘బిగ్ బాస్’ ఓటీటీ తొలి సీజన్ ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరోవారంలో కొనసాగుతోంది. గడిచిన నాలుగు వారాల్లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అయ్యారు. ప్రస్తుతం ఆరోవారానికి సంబంధించి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఆరు వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఉత్కంఠత నెలకొంది.

    బిగ్ బాస్ లో నామినేషన్స్ ప్రక్రియ చాలా కీలమైంది. నామినేషన్ లోకి వచ్చిన వారిలో ఎవరినీ ఉంచాలి? ఎవరినీ బయటికి పంపాలనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. కాగా ఆరో వారంలో మొత్తం పది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. ఈ వారంలో నామినేషన్స్ టాస్క్ ఎన్నో గొడవలతో సాగింది. దీంతో మొత్తంగా పది మంది నామినేషన్స్ లోకి ఎంటరయ్యారు.

    వీరిలో మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్, అషు రెడ్డి, హమీదా, ముమైత్ ఖాన్‌, బిందు మాధవి, యాంకర్ శివ, మహేష్ విట్టా, అజయ్, స్రవంతిలు ఉన్నారు. కెప్టెన్ అఖిల్‌తోపాటు ఆరియానా గ్లోరీ ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. అయితే వీరిలో ఒక్క బింది మాధవికి మాత్రమే ఏకంగా యాభై శాతం ఓట్లురాగా మిగిలిన ఓట్లు కంటెస్టెంట్స్ వారీగా చిలీపోయాయి.

    తాజా సమాచారం మేరకు యాంకర్ శివ రెండో స్థానంలో ఉండగా అషు రెడ్డి మూడు, హమీదా నాలుగు, అజయ్ ఐదు, నటరాజ్ మాస్టర్ ఆరు, మిత్రా శర్మ ఏడు, మహేశ్ విట్టా ఎనిమిదో స్థానాల్లో ఉన్నారు. దీంతో వారంతా కూడా ఈ వారం సేఫ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక తొమ్మిదో స్థానంలో స్రవంతి చోకారపు ఉండగా పదో స్థానంలో ముమైత్ ఖాన్ ఉన్నారని తెలుస్తోంది.

    అయితే ఈ వారంలో బిగ్ బాస్ ఇద్దరిని ఎలిమినేషన్ చేసి అందరికీ ట్వీస్ట్ ఇస్తారనే టాక్ విన్పిస్తోంది. దీంతో వీరిద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లే అవకాశం కన్పిస్తోంది. బిగ్ బాస్ చివరి నిమిషంలో ఒకరిని ఎలిమినేట్ చేసినా కూడా ముమైత్ ఖాన్ హౌస్ నుంచి ఎలిమినేషన్ అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.