Shruti Haasan: శృతి హాసన్ విశ్వ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా ఆమెకు కష్టపడకుండానే స్టార్ డమ్ వచ్చింది అంటారు. ఐతే, హీరోగారి కూతురిగా కాకుండా, తాను ఓ ప్రముఖ హీరోయిన్ గా ఉండాలని గ్లామర్ ప్రపంచంలో హద్దులు దాటింది శృతి హాసన్. సక్సెస్ కూడా అయింది. అయితే, స్టార్ హీరోయిన్ అయిన దగ్గర నుండి శ్రుతీహాసన్ లో చాల మార్పులు వచ్చాయి.

ఒకప్పుడు తానూ ఎన్ని కష్టాలు పడిందో చాలా ఓపెన్ గా చెప్పేస్తోంది. కెరీర్ ప్రారంభంలో తనను కొందరు అన్ లక్కీ అన్నారని హీరోయిన్ శృతిహాసన్ తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘హీరోయిన్ పాత్రలకు సరిపోనని, వాయిస్ బాలేదని, సక్సెస్ కాలేనన్నారు. తెలుగులో చేసిన 2 సినిమాలు ఆడలేదు. అప్పుడు అన్ లక్కీ, ఐరన్ లెగ్ అన్నారు.
Also Read: ఆర్జే చైతూకి నాగార్జున అక్షింతలు
గబ్బర్ సింగ్ హిట్‌తో గోల్డెన్ లెగ్ అని పిలిచారు. మనపై ఇతరుల అభిప్రాయాలు వారికి తోచినట్లుగా ఉంటాయి. కానీ మనం మనతో నిజాయితీగా ఉండాలి’ అని చెప్పుకొచ్చింది. ఏది అయితే ఏం.. తన మనోగతాన్ని నిర్భయంగా బయట పెట్టుకోవడంలో కావొచ్చు, ఆమె లైఫ్ స్టైల్ లో కావొచ్చు రోజులు గడిచేకొద్దీ శృతిహాసన్ మితిమీరుతోంది అంటున్నారు నెటిజన్లు.

నిజమే, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతాను అంటూ సోషల్ మీడియాలో ప్రతి అంశం పై పోస్ట్ చేస్తూ ఉంది శృతి, పైగా అమ్మడు గెటప్స్ కూడా మరీ దారుణంగా ఉంటున్నాయి. అయినా శృతిహాసన్ ఏది పట్టించుకునే స్థితిలో లేదు. అన్నట్టు శృతిహాసన్ కరోనా బారిన పడి ప్రస్తుతం కోలుకున్న సంగతి తెలిసిందే.
Also Read: తన సినిమాల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్
[…] […]