Bigg Boss 6 Telugu- Srihan: బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యినప్పటి నుండి నేటి వరుకు హౌస్ లో టాప్ 2 కంటెస్టెంట్స్ ఎవరు అని అడిగితె టక్కుమని చెప్పే పేర్లు రేవంత్ మరియు శ్రీహాన్..నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా మొదటి రెండు స్థానాల్లో వీళ్లిద్దరు కొనసాగుతూనే ఉన్నారు..రేవంత్ పట్ల నిన్న మొన్నటి వరుకు ప్రేక్షకుల్లో బాగా కోపిష్టి..నోటికి ఏది వస్తే అది మాట్లాడుతాడు అనే ఉద్దేశ్యం ఉండేది..ఇక శ్రీహాన్ విషయంలో అయితే రేవంత్ కంటే మంచి ఒపీనియన్ ఉండేది..బాగా ఆడుతాడు..ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం శ్రీహాన్ మంచి నేర్పరి..టైటిల్ గెలుచుకోవడానికి అన్ని విధాలుగా అర్హుడు అనే ఉద్దేశ్యం ఉండేది.

కానీ ఈ వారం అతను ప్రవర్తించిన తీరు చూస్తే ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని అనిపించక తప్పదు..నామినేషన్స్ సమయం లో కీర్తి ని నామినేట్ చేస్తూ అతను వేసిన వెక్కిళ్లు చేష్టలు చూసేందుకు చాలా చిరాకుగా అనిపించింది..కీర్తి కూడా శ్రీహాన్ వింత ప్రవర్తన చూసి షాక్ కి గురైంది.
వాస్తవానికి శ్రీహాన్ అక్కడ కీర్తి ని నామినేట్ చేస్తూ తానూ చెప్పాల్సిన పాయింట్స్ చెప్పి వెళ్ళిపోయి ఉంటె చాలా బాగుండేది..కానీ కీర్తి మాట్లాడుతున్న సమయం లో ఆమెని వెక్కిరించి కోపం తెప్పించడం..ఆ తర్వాత ఆమె ‘ఇక్కడ మంచి నిల్చొని మాట్లాడుతున్నాను కదా..మంచిగా నువ్వు కూడా మాట్లాడొచ్చు గా..ఆ వెక్కిళ్లు చేష్టలు ఏంటి రా’ అని ఆడుతుంది..అప్పుడు శ్రీహాన్ ‘రా నాకు..నోరు జాగ్రత్త..నోరు అదుపులో పెట్టుకుంటే నీకు బాగుంటుంది..నాకు బాగుంటుంది’ అంటూ కీర్తి దిష్టి బొమ్మ ముందు పెట్టిన కుండని చాలా కోపం తో బలంగా కొడుతాడు.

నామినేషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత కీర్తి మెరీనా తో మాట్లాడుతూ ‘రా అన్నదానికి వాడు అంత సీన్ చేసాడు..ఎన్నో సార్లు నేను సరదాగా ఇంతకుముందు రా అని పిలిచి ఉన్నాను..అప్పుడు రాని కోపం ఇప్పుడు ఎందుకు వచ్చింది..ఆ వెక్కిళ్లు చేష్టలు ఏమిటో..ఆ కొట్టడం ఏంటో..మనసులో ఇంత ద్వేషం నామీద పెట్టుకున్నాడని ఇన్ని రోజులు నాకు తెలియదు’ అని చెప్పుకుంటూ బాధపడుతుంది..నిజానికి ఆమెకి మాత్రమే కాదు..ఈ షో ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వారం శ్రీహాన్ ప్రవర్తించిన తీరు నచ్చలేదు..మరి దీనిపై ఈ వీకెండ్ లో నాగార్జున ఎలా స్పందిస్తాడో చూడాలి.