Actresses Terrible Diseases: హీరోయిన్స్ కలర్ ఫుల్ లైఫ్ వెనుక కనిపించని కష్టాలు అనేకం. కోట్లు ఉన్నా కోరుకున్నట్లు బ్రతక లేని జీవితాలు వాళ్ళవి. తీరిక లేని షెడ్యూల్స్ తో ఆరోగ్యం అస్తవ్యస్తం. ఒక టైం అంటూ లేని వృత్తిలో హీరోయిన్స్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో అనేక మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతారు. చాలా మంది హీరోయిన్స్ పలు కారణాలతో దీర్ఘకాలిక మానసిక, శారీరక వ్యాధులకు లోనయ్యారు. వారెవరో వారికొచ్చిన వ్యాధులు ఏమిటో పరిశీలిద్దాం.

సమంత లైఫ్ స్టైల్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయినా ఆమె అరుదైన మయోసైటిస్ బారిన పడ్డారు. సమంతకు ఈ వ్యాధి సోకడానికి మితిమీరిన వ్యాయామమే అని ప్రచారం అవుతున్నా అసలు కారణం అనేది తెలియదు. సమంత మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటున్నారు. ఆమె గతంలో స్కిన్ డిసీజ్ బారిన కూడా పడ్డారు. బెల్లీ భామ ఇలియానా బాడీ డిస్మార్ఫిక్ డిజాస్టర్ అనే మానసిక వ్యాధితో బాధపడ్డారు. ఈ వ్యాధి సోకిన వాళ్లు అందం, శరీరం గురించి ఆత్మన్యూనతా భావానికి గురవుతారు. మిగతా వాళ్ళ కంటే నేను అందంగా లేను, శరీరంలోని ఈ పార్ట్ సరిగా లేదనే అపోహలో ఉంటారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా కాలం స్కిన్ అలర్జీ సమస్యతో బాధపడ్డారు. మేకప్స్ ఈ స్కిన్ డిసీజ్ కి కారణమయ్యాయి. ట్రీట్మెంట్ తీసుకున్న నయనతార ఈ వ్యాధి నుండి బయటపడ్డారు. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె చాలా కాలంగా మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. దీపికాను డిప్రెషన్ వెంటాడుతుంది. చికిత్స తీసుకుంటున్నా ఆమె ఈ సమస్య నుండి బయటపడలేకపోతున్నారు.
హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ప్రాణాంతక ఇమ్మ్యూనో డిజాస్టర్ బారినపడ్డారు. రోజుల తరబడి స్నేహ ఆసుపత్రి బెడ్ కే పరిమితమయ్యారు. సింహ, ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్ వంటి హిట్ చిత్రాల్లో స్నేహా ఉల్లాల్ నటించారు. అనుష్క శర్మను ఆందోళన అనే మానసిక వ్యాధి వెంటాడింది. ఈ యాంగ్జైటీ ప్రాబ్లమ్ ఉన్నవారు ప్రతి చిన్న విషయానికి భయపడతారు. ఏదో జరిగిపోతుంద్న భావనలో ఉంటారు.

ఇక అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ని డయాబెటిస్ వేధిస్తుంది. 37 ఏళ్ల సోనమ్ చాలా కాలంగా డయాబెటిస్ తో భాదపడుతున్నారు. ఆమె చికిత్స తీసుకుంటున్నారు. మరో బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా సైతం మానసిక వ్యాధి బారిన పడ్డారు. డిప్రెషన్ కి గురైన పరిణితి చోప్రా చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్స్ ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడ్డారు.