Mirzapur season 3 : ‘మీర్జాపూర్ సీజన్ 3’ లో ఈ నటీ నటులు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా..?

Mirzapur season 3 ఇక గుడ్డు పండిట్ క్యారెక్టర్ లో నటించిన 'అలీ ఫజల్' ఒక్కో ఎపిసోడ్ కు 12 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈయన 10 ఎపిసోడ్లకు గాను ఒక కోటి 20 లక్షల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తుంది...ఇక మిగిలిన క్యారెక్టర్లు పోషించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ల వాళ్ళ పరిధిని బట్టి రెమ్యూనరేషన్ తీసుకున్నారు. కానీ గుడ్డు భాయ్ మాత్రం భారీ రేంజ్ లో తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

Written By: NARESH, Updated On : July 9, 2024 11:40 am

Mirzapur season 3

Follow us on

Mirzapur season 3 : బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మీర్జాపూర్ సిరీస్ ఇండియాలోనే చాలా పాపులర్ అయిన సిరీస్ గా గుర్తింపు పొందింది. ఇంతకుముందు వచ్చిన రెండు సీజన్లు సూపర్ హిట్ అవ్వడంతో ఇక రీసెంట్ గా ఈ సీజన్ 3 కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ నేపథ్యంలో దీనికి అత్యంత భారీ వ్యూయర్షిప్ అయితే దక్కుతుంది. ఇక ఇదిలా ఉంటే మీర్జాపూర్ లో కీలక పాత్రధారులు అయిన ఇద్దరు నటి నటులు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…ఇక ఈ సిరీస్ లో కాలీన్ భాయ్ భార్య బీనా త్రిపాఠి గా నటించి మెప్పించిన నటి ‘రసిక దుగ్గల్ ‘ ఒక్క ఎపిసోడ్ కి 2 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేసిందట. అంటే మొత్తం పది ఎపిసోడ్లు ఉన్నాయి. కాబట్టి ఆమె 20 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక గుడ్డు పండిట్ క్యారెక్టర్ లో నటించిన ‘అలీ ఫజల్’ ఒక్కో ఎపిసోడ్ కు 12 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈయన 10 ఎపిసోడ్లకు గాను ఒక కోటి 20 లక్షల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తుంది…ఇక మిగిలిన క్యారెక్టర్లు పోషించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ల వాళ్ళ పరిధిని బట్టి రెమ్యూనరేషన్ తీసుకున్నారు. కానీ గుడ్డు భాయ్ మాత్రం భారీ రేంజ్ లో తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సీజన్ లో మున్నా భయ్యా లేకపోవడం వల్ల అంత బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం అంటూ కొంతమంది అభిమానులైతే వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే సీజన్ 3 వరకు ‘మీర్జాపూర్ ‘ సిరీస్ కొనసాగుతూ రావడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. అలాగే ఇండియాలోనే నెంబర్ వన్ సీరీస్ గా గుర్తింపు పొందటం అంటే మాములు విషయం కాదు..మరి ఇక మీదట కూడా సీజన్ 4 ని కొనసాగిస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…