Rajamouli: రాజమౌళి కి మిగితా దర్శకులకు ఇదే తేడా..ఆయన్ని టచ్ చేసే దర్శకులు లేరా..?

ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నా రాజమౌళికి ఉండే ప్రత్యేకత వేరనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మేకింగ్ లో గాని స్టోరీలో గాని, ప్రజెంటేషన్ లో గాని ఒక ప్రత్యేకమైన పర్ఫామెన్స్ అయితే చూపిస్తాడు.

Written By: Gopi, Updated On : June 30, 2024 12:44 pm

Rajamouli

Follow us on

Rajamouli: తెలుగు సినిమా చరిత్రని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యం తో సినిమాలు చేసే దర్శకులు కొంతమంది మాత్రమే ఉంటారు. అయితే చాలా మంది దర్శకులు ఇండస్ట్రీ లో వాళ్ళ మనుగడ కొనసాగడానికి సినిమాలు తీస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం వాళ్ళు తీస్తున్న సినిమాల ద్వారా వాళ్ళ భాషకి, వాళ్ల ప్రాంతానికి పేరు రావాలని ఒక దృఢ సంకల్పంతో సినిమాలు చేసి మొత్తానికైతే వాళ్ళనుకునేది రీచ్ అవుతుంటారు. అలాంటి వాళ్ళలో రాజమౌళి ఒకరు…

ఆయనకు సినిమా అంటే వ్యసనం దానికోసం ఎంతటి కష్టం అయినా పడడానికి ఏదైన చేయడానికి రెడీగా ఉంటాడు. ఫైనల్ గా ఆయన సినిమాను కూడా భారీ రేంజ్ లో చూపించేలా సినిమాను డిజైన్ చేసుకుంటాడు. అందుకే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క దమ్మున్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా తో ఆయన భారీ సక్సెస్ కనక కొడితే ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగిపోతుంది.

ఇక ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నా రాజమౌళికి ఉండే ప్రత్యేకత వేరనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మేకింగ్ లో గాని స్టోరీలో గాని, ప్రజెంటేషన్ లో గాని ఒక ప్రత్యేకమైన పర్ఫామెన్స్ అయితే చూపిస్తాడు. ఇంతవరకు ఆ హీరోలు ఏ సినిమాలో కూడా మనకలా కనిపించరు. కాబట్టి ఈయన సినిమాలోనే ఆ హీరోలు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. దానివల్ల మంచి గుర్తింపు రావడానికి కూడా అవకాశం ఉంటుంది.

అందుకే ఆయన సినిమాలో చేస్తే ప్రతి ఒక్కరికీ తమదైన రీతిలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు అనే పేరు అయితే వస్తుంది. కాబట్టి రాజమౌళి సినిమాలో హీరో ఒక వారియర్ లా కనిపిస్తాడు. ప్రతి సిచువేషన్ లో ఉన్న ఎమోషన్స్ ని పీక్ స్థాయిలోకి తీసుకెళ్లి సినిమాను తారా స్థాయిలో నిలబెట్టే ఒకే ఒక దర్శకుడు రాజమౌళి…కానీ మిగితా దర్శకుల సినిమాల్లో ఇవేమీ కనిపించవు. ఇక ఆయనతో తదితర దర్శకులను పోల్చడం కూడా కరెక్ట్ కాదని చెప్పవచ్చు…