https://oktelugu.com/

Ashu Reddy: వాటికి సర్జరీ చేయించుకున్నావా? అషురెడ్డిని డైరెక్ట్ గా అడిగేశాడు! అమ్మడు రియాక్షన్ ఏంటి?

హౌస్లో తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే గేమ్ పరంగా ఆమె వెనుకబడ్డారు. ఈ కారణంగా అషురెడ్డి పెద్దగా రాణించలేదు. చాలా తక్కువ రోజుల్లోనే ఎలిమినేటై బయటకు వచ్చింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 16, 2024 / 09:08 AM IST

    Ashu Reddy

    Follow us on

    Ashu Reddy: అషురెడ్డి సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ అనడంలో సందేహం లేదు. ఇంస్టాగ్రామ్ వేదికగా సంచలన ఫోటో షూట్స్ చేస్తుంది. మితిమీరిన స్కిన్ షో చేసేందుకు అసలు వెనుకాడదు. ఈ క్రమంలో తరచుగా సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొంటుంది. తాజాగా ఓ నెటిజన్ ఆమెను ప్రైవేట్ క్వశ్చన్ అడిగాడు. ఇది హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ సమంతగా అషురెడ్డికి పేరుండేది. ఆమె సోషల్ మీడియా స్టార్ కావడానికి కారణం ఇదే. అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డి ఆఫర్ పట్టేసింది.

    హౌస్లో తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే గేమ్ పరంగా ఆమె వెనుకబడ్డారు. ఈ కారణంగా అషురెడ్డి పెద్దగా రాణించలేదు. చాలా తక్కువ రోజుల్లోనే ఎలిమినేటై బయటకు వచ్చింది. బిగ్ బాస్ షోతో ఆమెకు బుల్లితెర ఆడియన్స్ లో కూడా ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డికి ఎఫైర్ ఉందనే వాదనలు ఉన్నాయి. వీరి ప్రవర్తన అలానే ఉంటుంది. ఒక్కోసారి అలా కథనాలు వెలువడేలా సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతుంటారు.

    ఇక తరచుగా అషురెడ్డి గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. గ్లామర్ డోస్ ఎక్కువ కావడంతో అషురెడ్డిని దారుణంగా ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నెగిటివ్ కామెంట్స్ ని అషురెడ్డి పట్టించుకోదు. గ్లామర్ ఫీల్డ్ లో ఇవన్నీ కామన్ అన్నట్లు ముందుకు పోతుంది. అప్పుడప్పుడు కౌంటర్లు ఇస్తుంది. గతంలో ఒకసారి… మీ కళ్ళలోనే కామం ఉంది. నా బట్టల్లో తప్పులేదంటూ వీడియో చేసి వదిలింది. తాజాగా అషురెడ్డి బ్లాక్ ట్రెండీ వేర్లో ఒక ఫోటో షూట్ చేసింది.

    ఈ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పలువురు నెటిజెన్స్ సదరు ఫోటోల మీద కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ అషురెడ్డి మీద పర్సనల్ అటాక్ చేశాడు. ప్రైవేట్ ప్రశ్న అడిగాడు. మీరు బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నారా? అని తన సందేహం బయటపెట్టారు. అందం కోసం చాలా మంది హీరోయిన్స్ బ్రెస్ట్ సర్జరీ చేయించుకుంటారు. కొందరు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు కూడా. ఈ క్రమంలో అషురెడ్డిని చూసిన నెటిజన్ కి సందేహం వచ్చింది. ఈ ప్రశ్నకు అషురెడ్డి స్పందన ఏంటనే చర్చ నడుస్తోంది.