Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి ఈ మధ్య ఎక్కువగా యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నారు. కంటెంట్ నచ్చితే చిన్న డైరెక్టర్ అయినా సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ బాబీ కి అవకాశం ఇచ్చారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘ వాల్తేరు వీరయ్య ‘ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా రూ. 220 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. చిరంజీవి యువ దర్శకులతో పని చేయడం వెనుక హీరో రజినీకాంత్ ప్రమేయం ఉందట.
ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమాల విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పిన మాటలు పాటిస్తున్నారట. ఈ విషయం స్వయంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరంజీవి మాట్లాడుతూ .. ”కొన్నాళ్ల క్రితం నేను, రజినీకాంత్ కలిసినప్పుడు సినిమాల గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు రజినీకాంత్ నాకు ఒక మాట చెప్పారు. గతంలో మనం పని చేసిన లెజండరీ దర్శకులు ఇప్పుడు లేరు, కొంత మంది సినిమాలు తీయట్లేదు.
మనం కొత్త దర్శకులకి, యువ దర్శకులకి ఛాన్సులు ఇవ్వాలి. ఇప్పుడున్న దర్శకుల్లో మన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మన సినిమాలు చూస్తూ వాళ్ళు పెరిగారు. వాళ్ళకి అవకాశాలు ఇస్తే అభిమానులు మనల్ని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపిస్తారు. ఎలా చూడాలనుకుంటున్నారో .. ఎలా చూపించాలో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి మనకి మంచి సినిమాలు ఇస్తారు అని ఆయన చెప్పారు. రజినీకాంత్ మాటను నేను పాటిస్తున్నాను.
అందుకే బాబీకి ఛాన్స్ ఇచ్చాను. వాల్తేరు వీరయ్య లాంటి హిట్ సినిమా ఇచ్చాడు. ఇప్పుడు వశిష్ఠతో విశ్వంభర చేస్తున్నాను,” అని అన్నారు. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో చిరంజీవి బిజీగా ఉన్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. స్టాలిన్ తర్వాత మళ్లీ ఇన్నాళ్ళకి చిరంజీవి – త్రిష జతకట్టారు. సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో విశ్వంభర తెరకెక్కుతుంది.