https://oktelugu.com/

ఈసారి ఐపీఎల్ ఆదాయం 4 వేల కోట్లు…

కరోనా  కాలంలో  యూఏఈలో ఐపీఎల్ 2020ని  బీసీసీఐ విజయవంతంగా నిర్వహించింది. సెప్టెంబరు 19వ తేదీన ప్రారంభం అయిన  ఐపీఎల్ 13 వ సీజన్.. నవంబర్ 10వ తేదీతో ముగిసింది.  ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించి ఐదవసారి టైటిల్ దక్కించుకుంది. దాదాపు 50 రోజులకి పైగా క్రికెట్ ప్రేమికులని అలరించింది ఐపీఎల్. దేశంలో కరోనా రోగుల సంఖ్య వేగంగా పెరగడంతో ఐపీఎల్ వాయిదా పడి చివరకు టోర్నమెంట్‌ను  యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఈ సీజన్‌ను నిర్వహించడానికి  బీసీసీఐ , యూఏఈ క్రెకెట్ బోర్డుకు  భారీ మొత్తాన్ని చెల్లించింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2020 / 03:54 PM IST
    Follow us on

    కరోనా  కాలంలో  యూఏఈలో ఐపీఎల్ 2020ని  బీసీసీఐ విజయవంతంగా నిర్వహించింది. సెప్టెంబరు 19వ తేదీన ప్రారంభం అయిన  ఐపీఎల్ 13 వ సీజన్.. నవంబర్ 10వ తేదీతో ముగిసింది.  ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించి ఐదవసారి టైటిల్ దక్కించుకుంది.

    దాదాపు 50 రోజులకి పైగా క్రికెట్ ప్రేమికులని అలరించింది ఐపీఎల్. దేశంలో కరోనా రోగుల సంఖ్య వేగంగా పెరగడంతో ఐపీఎల్ వాయిదా పడి చివరకు టోర్నమెంట్‌ను  యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఈ సీజన్‌ను నిర్వహించడానికి  బీసీసీఐ , యూఏఈ క్రెకెట్ బోర్డుకు  భారీ మొత్తాన్ని చెల్లించింది.  చక్కటి ఆతిథ్యం ఇచ్చిన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు‌‌కి రూ.100 కోట్లు చెల్లించినట్లు సమాచారం.

     కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత్‌లో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహణ కష్టతరం కాగా.. తాము ఆతిథ్యమిస్తామని యూఏ ముందుకు వచ్చింది. ఆ వెంటనే శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ప్రపోజల్‌ తెచ్చినా.. అన్ని వసతులు మెండుగా ఉన్న కారణంగా.. యూఏఈ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది.  ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్‌ ఈ ఏడాది జరగకపోయి ఉంటే బీసీసీఐ రూ.4వేల కోట్లు నష్టపోయేది.

    ఈ సీజన్‌లోని మొత్తం 60 మ్యాచ్‌లు దుబాయ్షార్జా మరియు అబుదాబి  మైదానాల్లో జరిగాయి. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి మెరుగుపడి టీకా వస్తేనే వచ్చే సీజన్ (ఐపిఎల్ 2021) భారత్‌లో జరుగుతుందనిఐపిఎల్ 2021 కూడా ఒకవేళ భారత్‌లో జరిగే పరిస్థితి లేకపోతే.. మొదటి ప్రాధాన్యత యూఏఈ నే అవుతుంది.

    ఇది మాత్రమే కాదు.. ఐపీఎల్ కారణంగా యూఏఈకి ఆదాయం కూడా బాగానే వచ్చింది. ఐపిఎల్ 2020 UAEలో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు జరగగా.. ఆ సమయంలో ఆటగాళ్ళు మరియు సహాయక సిబ్బందితో సహా మొత్తం ఎనిమిది జట్లు అక్కడకు చేరుకోవడంతో.. 14 ఫైవ్ స్టార్ హోటళ్ళు సుమారు మూడు నెలలు పూర్తిగా నిండిపోయాయి. దీని ద్వారా కోట్లలో ఆదాయం లభించింది

    బీసీసీఐ దాదాపుగా 4 వేల కోట్ల ఆదాయం పొందినట్లు తెలుస్తోంది. అలాగే గతేడాదితో పోలిస్తే ఈ సారి టీవీ, డిజిటల్ మాధ్యమాల వీక్షకుల సంఖ్య 25 శాతం పెరిందట. టోర్నీ జరిగనన్ని రోజలు అన్ని ఫ్రాంచైజీల వారికి 30 వేల కొవిడ్ టెస్టులు చేసినట్లు తెలుస్తోంది.