https://oktelugu.com/

Nani: సుజీత్ నాని తో చేసే సినిమాలో నటించనున్న మరో యంగ్ హీరో…

పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజి సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంటుందనే ఒక ఆశాభావం అయితే తను వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నాని హీరోగా సుజీత్ డైరెక్షన్ లో ఒక సినిమా అనౌన్స్ చేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 30, 2024 / 09:52 AM IST

    Nani

    Follow us on

    Nani: తెలుగులో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక దర్శకులు కూడా వాళ్ల నుంచి అభిమానులు ఎలాంటి సినిమాలు అయితే కోరుకుంటున్నారో ఆ సినిమాలని ప్రేక్షకుల ముందు ఉంచడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ముఖ్యంగా సుజీత్ లాంటి డైరెక్టర్ సినిమా సినిమాకి తన వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన రెండు సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజి సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంటుందనే ఒక ఆశాభావం అయితే తను వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నాని హీరోగా సుజీత్ డైరెక్షన్ లో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంభందించిన ఒక మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడం విశేషం…

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రస్తుతం యంగ్ హీరో అయిన విశ్వక్ సేన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి అది ఎలాంటి పాత్ర అనేది ఇప్పటివరకు రివిల్ చేయనప్పటికీ తను ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సుజీత్ మరో భారీ హిట్ కొట్టి తనని తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    మరి ఈ సినిమాతో సుజీత్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఓజీ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు… ఓజీ సినిమా సూపర్ సక్సెస్ అయితే సుజీత్ నాని సినిమా మార్కెట్ అనేది భారీగా వర్కౌట్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.