Viral Video: నేను ఏ తప్పు చేయలేదంటున్న ప్రణీత్ హనుమంత్ వివాదంలో ఉన్న మరో నిందితుడు…వీడియో వైరల్…

Viral Video: ఆ వీడియోలో కనిపించిన నలుగురు వ్యక్తుల మీద కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి సైతం సంభందిత అధికారులకు తెలియజేశారు. ఇక మొదటగా ఈ ఇష్యూ ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళింది మాత్రం సాయిధరమ్ తేజ్ అనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : July 10, 2024 10:29 am

Another accused in Praneeth Hanumantu Controversy

Follow us on

Viral Video: నాలుగైదు రోజుల నుంచి ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఒక వీడియో మీద భారీ వివాదాలైతే వస్తున్నాయి. నిజానికి ఒక తండ్రి కూతుర్ల మధ్య ఉన్న బంధాన్ని అవహేళన చేస్తూ, అసభ్యంగా వాళ్ళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ వెకిలి నవ్వు నవ్వుతూ ప్రతి ఒక్క తండ్రి కోపానికి గురయ్యాడు. నిజానికి ఇలాంటి వాటివల్ల సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఒకసారి వాళ్లకు వాళ్ళు అర్థం చేసుకోవాలి.

ఇక ఆ వీడియోలో కనిపించిన నలుగురు వ్యక్తుల మీద కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి సైతం సంభందిత అధికారులకు తెలియజేశారు. ఇక మొదటగా ఈ ఇష్యూ ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళింది మాత్రం సాయిధరమ్ తేజ్ అనే చెప్పాలి. డార్క్ కామెడీ రూపంలో ఇది పడితే అది మాట్లాడుతూ, ఎవరిని పడితే వారిని దూషిస్తూ వీడియోలు చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళను తప్పకుండా శిక్షించాలి అంటూ సామాన్య మానవులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటివి చేయడానికి భయపడతారు.

ఇప్పటికే సమాజంలో చిన్న పిల్లల మీద చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే వీళ్లు వాటిని ఎంకరేజ్ చేసినట్టుగా వీడియోలు చేయడం సరైన విషయం కాదు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని అయితే తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ వీడియోలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో హనుమంతుని పక్కన పెడితే డల్లాస్ నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి రీసెంట్ గా తను నేను ఏ తప్పు చేయలేదు అంటూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. నిజానికి నేను ఆ వీడియోలో ఒక మాట కూడా అనలేదు.

సరే నేను ఒక్క మాట కూడా అనలేదు కాబట్టి నేను తప్పు చేయలేదు అని చెప్పడం లేదు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆపకపోవడం, అక్కడి నుంచి బయటికి వెళ్లకపోవడం నేను చేసిన తప్పు అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. నాకుచాలా భయమేస్తుంది అంటూ రీసెంట్ గా తను ఒక వీడియో ను పోస్ట్ చేశాడు…