Anchor Suma: సుమ కనకాల కొత్త బాధ్యత నెత్తికి ఎత్తుకుంది. ఆమె పెళ్లిళ్ల పేరమ్మగా మారింది. ఓ పెళ్ళై పిల్లలున్న హీరోకి యంగ్ హీరోయిన్ కి పెళ్లి చేసే పనిలో బిజీగా ఉంది. దాంతో అందరూ అవాక్కు అవుతున్నారు. యాంకర్ గా సుమది రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం. ఏళ్లుగా ఆమెకు పోటీ ఇచ్చిన మరొక యాంకర్ లేదంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర షోలు, ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్… కార్యక్రమం ఏదైనా సుమ ఉండాల్సిందే. తన మాటల గారడితో ఆడియన్స్ ని కట్టిపడేయడం సుమకు ఉన్న గొప్ప లక్షణం.
ఈ మధ్య బుల్లితెర షోలు తగ్గించిన సుమ స్టార్స్ ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్ మీద దృష్టి పెడుతుంది. సుమ అడ్డా పేరుతో ఒక షో మాత్రమే ఆమె చేస్తున్నారు. అయితే సుమ కొత్త బాధ్యత తీసుకున్నారట. పెళ్లిళ్ల పేరమ్మగా మారారట. పెళ్ళై పిల్లలు ఉన్న అల్లరి నరేష్ కి యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు పెళ్లి చేయాలని అనుకుంటుందట. ఇదేం ట్విస్ట్ అని మీ మైండ్ బ్లాక్ కావచ్చు. కానీ అది నిజ జీవితంలో కాదు.
అల్లరి నరేష్-ఫరియా అబ్దుల్లా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. ఈ మూవీ మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు అల్లరి నరేష్-ఫరియా అబ్దుల్లా. ఈ జంటను సుమ కనకాల ఇంటర్వ్యూ చేశారు. సదరు ఇంటర్వ్యూలో అల్లరి నరేష్-ఫరియా అబ్దుల్లాకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది సుమ. ఆ ఒక్కటీ అడక్కు మూవీలో అల్లరి నరేష్ పెళ్లి కానీ అబ్బాయి పాత్ర చేశాడు. ఆ సినిమా కాన్సెప్ట్ కి దగ్గరగా ఇంటర్వ్యూ సాగింది.
పెళ్లికాక ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ కి ఫరియా అబ్దుల్లాను భార్యగా తేవాలని సుమ చూశారన్నమాట. అదీ సంగతి. ఆ ఒక్కటీ అడక్కు మూవీ విడుదల ఒకసారి పోస్ట్ పోన్ అయ్యింది. మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మల్లి అంకం దర్శకుడు. కామెడీ చిత్రాలు వర్క్ అవుట్ కాకపోవడంతో అల్లరి నరేష్ ఈ మధ్య వరుసగా సీరియస్ కంటెంట్ తో కూడిన చిత్రాలు చేశాడు. అవి కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో మరలా తనకు కలిసొచ్చిన కామెడీ జోనర్ ఎంచుకున్నాడు..