Charmy Kaur: సిమ్లా ఆపిల్ లా ఉంటుంది ఛార్మి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగింది. ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్… ఇలా పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. అనుకోకుండా ఒక రోజు, జ్యోతిలక్ష్మి వంటి చిత్రాల్లో మెప్పించింది. జ్యోతిలక్ష్మి సినిమాలో వేశ్య పాత్రలో నటించి ఆశ్చర్య పరిచింది. అనూహ్యంగా నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా మారింది. దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు ఛార్మి. అదే సమయంలో ఛార్మి – పూరి జగన్నాథ్ మధ్య ఏదో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. వారు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వెలువడ్డాయి. విషయం ఏదైనా కలిసి జీవిస్తున్నారు. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు ఛార్మి. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ అనంతరం వచ్చిన ‘లైగర్ ‘ డిజాస్టర్ గా మిగిలింది.
ఆ సమయంలో ఛార్మి-పూరి ఆర్థికంగా నష్టపోయారని సమాచారం. లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ తో కూడా వివాదం నడిచింది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తో భారీ హిట్ కొట్టాలని పూరి జగన్నాథ్ – ఛార్మి గట్టి విశ్వాసంతో ఉన్నారు. డబుల్ ఇస్మార్ట్ జూన్ 14న విడుదల కానుంది. కాగా ఛార్మి లేటెస్ట్ లుక్ నెటిజన్స్ ని షాక్ కు గురి చేస్తుంది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఛార్మీ బ్లాక్ డ్రెస్ లో తన పెట్ డాగ్ ని ఎత్తుకుని కనిపిస్తుంది. ఈ లేటెస్ట్ పిక్ లో ఛార్మి చాలా బొద్దుగా కనిపించడంతో చూసిన వారు షాక్ అవుతున్నారు. ఛార్మి ఏంటి ఇలా తయారైంది. ఫిట్నెస్ గురించి అసలు పట్టించుకోవడం లేదేమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తరచూ వర్కౌట్స్ చేస్తూ కనిపించే ఛార్మి ఇలా ఎందుకు మారిందంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 16 ఏళ్లకే పరిశ్రమలో అడుగుపెట్టిన ఛార్మి ప్రస్తుత వయసు కేవలం 36 ఏళ్ళు మాత్రమే.