https://oktelugu.com/

Vishal: ధోని అంటే మనకు ఇష్టం…కానీ ఆయన తీసిన సినిమాకి ఎంత నష్టం వచ్చిందో తెలుసా..?

నిజానికి నేను మాట్లాడింది ఒకటి కానీ మధ్యలో కొంతమంది కావాలనే దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు.అసలు ఈ విషయం మీద నేను వివరణ ఇవ్వలసిన అవసరం లేదు కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను.

Written By:
  • Gopi
  • , Updated On : April 20, 2024 / 09:59 AM IST

    Vishal

    Follow us on

    Vishal: సినిమా ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విశాల్.. ఇక ఈయన హీరోగా హరి దర్శకత్వంలో రత్నం అనే సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అందులో భాగంగానే విశాల్ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలను ఇస్తూ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన ఇంతకు ముందు చిన్న సినిమాల నిర్మాతలపై చేసిన కామెంట్లు చాలా వైరల్ అయ్యాయి. ఇక దానికి వివరణ ఇస్తూ ఆయన ఏం చెప్పాడంటే…

    నిజానికి నేను మాట్లాడింది ఒకటి కానీ మధ్యలో కొంతమంది కావాలనే దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు.అసలు ఈ విషయం మీద నేను వివరణ ఇవ్వలసిన అవసరం లేదు కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లుగా రాణించడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే ఏ సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుందో, ఏ సినిమా ఎప్పుడు ఫెయిల్ అవుతుందో మనం చెప్పడం చాలా కష్టం. అందువల్లే నేను ఏం చెప్పాను అంటే చిన్న నిర్మాతలకు ప్రస్తుతం సినిమాలు చేసిన సక్సెస్ లు రావడం లేదు.

    అందువల్లే నేను ఏం చెప్పాను అంటే చిన్న నిర్మాతలకు ప్రస్తుతం సినిమాలు చేసిన సక్సెస్ లు రావడం లేదు. కాబట్టి కొద్ది రోజులపాటు చిన్న నిర్మాతలు సినిమా చేయకుండా ఆపితే మంచిది. ఇక దానికి కొంతమంది నేను మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ అలా ఎలా అంటాడు. చిన్న సినిమాలను నమ్ముకొని చాలా మంది టెక్నీషియన్లు బతుకుతున్నారు. చిన్న నిర్మాతలు సినిమాలు చేయకపోతే వాళ్ళందరూ ఎలా బతుకుతారు. అంటూ నామీద కామెంట్స్ చేస్తున్నారు.

    నిజానికి డబ్బు ఎవరిదైనా డబ్బే నేను ఆ ఉద్దేశంతోనే నిర్మాతలకు నష్టం రాకూడదని అలా చెప్పాను కానీ కొందరు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకొని ఇలా మాట్లాడుతున్నారు. అంతెందుకు మహేంద్రసింగ్ ధోని ఆటను చూసి మనం ముచ్చట మనం సంబర పడుతాం. అలాంటి ధోని ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసిన విషయం మనలో చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసిన కొంతమంది కూడా ఆ సినిమాను చూడడానికి వెళ్లలేదు ఇక దానివల్ల ఆయనకి ఎంత నష్టం వచ్చిందనేది ఒకసారి మీరు ధోనిని అడిగి తెలుసుకోండి. చిన్న నిర్మాతల పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుస్తుంది అంటూ ఆ విషయం మీద తను వివరణ అయితే ఇచ్చాడు…