Pushpa 2: షూటింగ్ వదిలేసి చెరో దేశానికి వెళ్లిన అల్లు అర్జున్, సుకుమార్… గొడవల వలనే పుష్ప 2 ఆగిపోయిందా? ఇదిగో క్లారిటీ

పుష్ప హిందీ వర్షన్ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్ కి పుష్ప విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 ఏకంగా రూ. 1000 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ కల్కి హిందీ రైట్స్ రూ. 100 కోట్లకు కొంటే.. పుష్ప 2 రైట్స్ రూ. 200 కోట్లకు కొన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ పుష్ప 2కి ఉన్న డిమాండ్ ఏమిటో.

Written By: S Reddy, Updated On : July 18, 2024 8:05 am

Pushpa 2

Follow us on

Pushpa 2: 2021లో విడుదలైన పుష్ప బ్లాక్ బస్టర్. దర్శకుడు సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా పుష్ప తెరకెక్కింది. ప్రారంభంలో సుకుమార్ కి పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన లేదు. దర్శకుడు రాజమౌళి సూచన మేరకు సుకుమార్ సీక్వెల్ కి పూనుకున్నాడట. నార్త్ లో పుష్ప చిత్రాన్ని పెద్దగా ప్రమోట్ చేయలేదు. మొదటి రోజు పుష్ప కేవలం రూ. 3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మౌత్ టాక్ తో మెల్లగా పుంజుకున్న పుష్ప… నార్త్ లో సత్తా చాటింది.

పుష్ప హిందీ వర్షన్ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్ కి పుష్ప విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 ఏకంగా రూ. 1000 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ కల్కి హిందీ రైట్స్ రూ. 100 కోట్లకు కొంటే.. పుష్ప 2 రైట్స్ రూ. 200 కోట్లకు కొన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ పుష్ప 2కి ఉన్న డిమాండ్ ఏమిటో.

డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కలిపి వెయ్యి కోట్ల బిజినెస్ పుష్ప 2 చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. పుష్ప 2తో అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమని నమ్ముతున్న తరుణంలో కొన్ని రూమర్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే డిసెంబర్ 24కి వాయిదా వేశారు. దీనికి మరొక కారణం ఉందనే పుకార్లు తెరపైకి వచ్చాయి.

ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరోక్షంగా అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపాడనే వాదన ఉంది. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ఆయన మీద వ్యతిరేకతతో ఉన్నారు. వారి ఆగ్రహ జ్వాలలు చల్లారాక విడుదల చేయడం మంచిదని భావించారని ఓ వాదన. ఇదిలా ఉంటే… అల్లు అర్జున్-సుకుమార్ మధ్య అభిప్రాయ బేధాలు తెలెత్తాయనే కొత్త చర్చ మొదలైంది.

అల్లు అర్జున్ తన గడ్డం ట్రిమ్ చేయించాడు. పుషప్ 2 షూటింగ్ ముగియక ముందే అల్లు అర్జున్ గడ్డం ఎందుకు తగ్గించాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుష్ప 2 షూటింగ్ ఆగిపోవడం కూడా ఈ పుకార్లకు బలం చేకూర్చింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ టీమ్ స్పష్టత ఇచ్చింది. సుకుమార్ తో అల్లు అర్జున్ కి ఎలాంటి విభేదాలు లేవు. వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. సుకుమార్ యూఎస్ వెళ్లారు. అల్లు అర్జున్ యూరప్ లో ఉన్నారు.

ఇద్దరు వేర్వేరు పనుల మీద విదేశాలకు వెళ్ళడమైంది. అందుకే పుష్ప 2 షూటింగ్ కి తాత్కాలిక విరామం వచ్చింది. అంతే కానీ మరే ఇతర కారణాలు లేవని అన్నారు. కాగా సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో పుష్ప 2 నాలుగో చిత్రం. ఆర్య తో వీరి ప్రయాణం మొదలైంది. ఆర్య సుకుమార్ డెబ్యూ మూవీ. అల్లు అర్జున్ కి రెండో చిత్రం. అల్లు అర్జున్ కి ఓవర్ నైట్ స్టార్డం తెచ్చిన మూవీ ఆర్య.

అనంతరం ఆర్య 2 చేశారు. ఆ మూవీ పర్లేదు అనిపించింది. ఇక హ్యాట్రిక్ మూవీ పుష్ప తో పాన్ ఇండియా హిట్ కొట్టారు. పుష్ప వరల్డ్ వైడ్ రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో నటనకు నేషనల్ అవార్డు అందుకున్నాడు. కేవలం సుకుమార్ వలనే ఇది సాధ్యం అయ్యింది. ఆయన లేకపోతే నేను లేనని అల్లు అర్జున్ పలుమార్లు చెప్పడం విశేషం.