Horoscope Today: రవియోగం, బ్రహ్మయోగం కారణంగా ఈ రాశుల వారికి రాజయోగం.. వద్దన్నా డబ్బు..

వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. అనుకున్న ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం కొత్త ఉపాధిని వెతుక్కుంటారు. కొన్ని రంగాల వారికి అనుకోని అదృష్టం వరిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.

Written By: Chai Muchhata, Updated On : July 18, 2024 8:25 am

Horoscope Today

Follow us on

Horoscope Today: 2024 జూలై 18 గురువారం రోజున ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. గురువారం బ్రహ్మయోగం, రవియోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం కలగనుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. అనుకున్న ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం కొత్త ఉపాధిని వెతుక్కుంటారు. కొన్ని రంగాల వారికి అనుకోని అదృష్టం వరిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.

వృషభ రాశి:
ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల ద్వారా శుభవార్త వింటారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం. ఉద్యోగులు బాధ్యతలను నెరవేరుస్తారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మిథున రాశి:
విద్యార్థులు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా మద్దతు పొందుతారు. కొన్ని కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి:
కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. వ్యాపారులకు తండ్రి మద్దతు ఉంటుంది. మనసులో కొంత భారం ఉంటుంది. స్నేహితులను కలవడం వల్ల ప్రశాంతంగా మారుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

సింహారాశి:
ఆర్థికంగా కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. అయినా ఆదాయం పెరుగుతుంది. కొన్ని వివాదాలు ఉంటాయి. వాటిని పరిష్కరించేందుకు కష్టపడుతారు. ఎక్కువగా వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. కష్టానికి తగిన ఫలితం ఉండకపోవచ్చు.

కన్య రాశి:
విద్యార్థులు కెరీర్ కు సంబంధించిన శుభవార్త వింటారు. భవిష్యత్ ను దృష్టంలో ఉంచుకొని కొత్తపెట్టుబడులు పెడుతారు. బంధువుల నుంచి ప్రత్యేక గౌరవం పొందుతారు. కొత్త ఆస్తికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

తుల రాశి:
ఈ రాశి వారికి ఈరోజు దైవానుగ్రహం ఉంటుంది. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పనిభారం తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. నైపుణ్యాన్ని ప్రదర్శించడం వల్ల ఉద్యోగులు శుభవార్త వింటారు.

వృశ్చిక రాశి:
పాత వివాదాలు సమసిపోతాయి. నిరుత్సాహపరిచే వ్యక్తులు నుంచి దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు పదోన్నతి గురించి శుభవార్త వింటారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు శుభవార్త వింటారు.

ధనస్సు రాశి:
కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దు. అయితే నిర్లక్ష్యంగా ఉండాలి. పెండింగులో ఉన్న డబ్బు వసూలవుతుంది. స్నేహితుల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగులు కొన్ని విషయాల్లో కష్టపడాల్సి వస్తుంది.

మకర రాశి:
కుుటంబ సభ్యుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకునేవారు శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభరాశి:
పిల్లల కెరీర్ పైకొత్త ప్రణాళికలు వేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. విదేశాల నుంచి వ్యాపారం చేసేవారు ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు రావొచ్చు. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి.

మీనరాశి:
శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఈరోజు తిరిగి పొందుతారు. ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. సాయంత్రం కటుుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గురువుల ఆశీరద్వాదంతో విద్యార్థులు విజయం సాధిస్తారు.