Horoscope Today: ఈ రెండు రాశుల వారికి ఈరోజు అనుకోని అదృష్టం.. వద్దన్నా డబ్బు..

ఆత్మవిశ్వాతంతో ముందుకు సాగుతారు. అనుకున్న పనిని నెరవేరుస్తారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు చేపడుతారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న అవకాశం దొరికినా మీ పనుల్లో ఆటంకం సృష్టిస్తారు.

Written By: Chai Muchhata, Updated On : July 28, 2024 9:05 am

Horoscope Today

Follow us on

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజు ద్వాదశ రాశులపై అశ్వినీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేయనున్నాడు. ఆదివారం సర్వార్ద సిద్ధియోగం ఏర్పడనుంది. ఈ కారణంగా మేషం, మిథునంతో పాటు కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అనుకూల ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారికి వ్యతిరేక పవనాలు వీస్తాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవుతాయి. వ్యాపారులకు తండ్రి నుంచి మద్దతు ఉంటుంది. ఉద్యోగులు కొన్ని విషయాల్లో లాభపడుతారు. వీరికి అధికారుల మద్దతు ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలం. అనుకోని అదృష్టం కలగనుంది.

వృషభ రాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మీ పనులకు ఆటంకం కలిగిస్తారు. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు సాగుతాియ. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. విదేశానికి వెళ్లడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

మిథున రాశి:
జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. మీరు ఇతరులతో మంచిగా ప్రవర్తించాలి. లేదంటే వారు ఇబ్బందులకు గురవుతారు. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ చూపాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతలను నిర్వర్తించడంలో ఇతరుల సలహా తీసుకోవాలి.

కర్కాటక రాశి:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఎక్కువగా ఎవరితో వాదనలు చేయొద్దు. కష్టపడి పనిచేసిన వారికి సరైన ఫలితం ఉంటుంది. కారణాలు లేకుండా ఎవరితో మాట్లాడవద్దు. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు.

సింహారాశి:
ఆత్మవిశ్వాతంతో ముందుకు సాగుతారు. అనుకున్న పనిని నెరవేరుస్తారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు చేపడుతారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న అవకాశం దొరికినా మీ పనుల్లో ఆటంకం సృష్టిస్తారు.

కన్య రాశి:
కొందరు స్నేహితులతో కలవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయి. అలాంటి వారికి దూరంగా ఉండాలి. పిల్లల భవిష్యత్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

తుల రాశి:
ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కొందరు చేసే ఆరోపణలను తిప్పి కొడుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారులు బిజీగా ఉంటారు. కొత్త ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి పెడుతారు. కొన్ని విషయాల్లో అనవసర వాదనలు చేయకుండా ఉండడమే మంచిది.

వృశ్చిక రాశి:
వ్యాపారులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. కొన్ని పనుల విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయినా సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు.

ధనస్సు రాశి:
మానసికొ ఒత్తిడిని కలిగి ఉంటారు. అయితే ఈ పరిస్థితి గురించి పెద్దగా ఆందోళన చెందవద్దు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూల సమయం. సంబంధాల్లో చీలిక రావొచ్చు. ఇతరుల వద్ద నుంచి అప్పు తీసుకోవాల్సి వస్తే ఆలోచించాలి.

మకర రాశి:
సాయంత్రం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త వ్యూహాలు రచిస్తారు. ఉద్యోగులకు కొత్త ప్రతిపాదనలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. కొందరి విషయంతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఎక్కువగా సమయం కేటాయించవద్దు.

కుంభరాశి:
ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలు వెతుక్కుంటారు. పెద్దల సలహా ద్వారా కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు తమ బాధ్యతలను పూర్తి చేస్తారు. ప్రయాణాలు అంతగా కలిసి రావు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనరాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. వ్యాపారులు కుటుంబ సభ్యులతో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు.