https://oktelugu.com/

Tollywood Trends: సమంత చాలా హాట్‌ గా ఉందట.. దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్

Tollywood Trends :  టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావ’ ఐటెం సాంగ్‌లో సమంత హాట్‌ గా కనిపిస్తూ అందరి మనసులు దోచేసిందని హీరోయిన్ ప్రియమణి తెలిపింది. అంతేకాకుండా ఐటెం సాంగ్‌లో సమంత చాలా హాట్‌ గా ఉందని తన భర్త కూడా చెప్పాడని వెల్లడించింది. సమంత ఇప్పటివరకు ఇలాంటి సాంగ్ చేయలేదంటూ ఆమె నిర్ణయానికి అభినందనలు తెలిపిన ప్రియమణి.. సినిమాల్లో హీరోయిన్లు కేవలం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 31, 2022 / 04:31 PM IST
    Follow us on

    Tollywood Trends :  టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావ’ ఐటెం సాంగ్‌లో సమంత హాట్‌ గా కనిపిస్తూ అందరి మనసులు దోచేసిందని హీరోయిన్ ప్రియమణి తెలిపింది. అంతేకాకుండా ఐటెం సాంగ్‌లో సమంత చాలా హాట్‌ గా ఉందని తన భర్త కూడా చెప్పాడని వెల్లడించింది. సమంత ఇప్పటివరకు ఇలాంటి సాంగ్ చేయలేదంటూ ఆమె నిర్ణయానికి అభినందనలు తెలిపిన ప్రియమణి.. సినిమాల్లో హీరోయిన్లు కేవలం గ్లామర్‌ కోసమే కాదని సామ్ నిరూపించిందని చెప్పుకొచ్చింది.

    Samantha

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దొంగతనం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో స్థానికుల చేతిలో హత్యకు గురైన ఆదివాసి వ్యక్తి మధు కుటుంబ న్యాయపోరాటంలో సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు కేరళ న్యాయశాఖ మంత్రి పీ.రాజీవ్ను కూడా కలిశారని మమ్ముట్టి ఛారిటీ వ్యవహారాలను చూసుకునే రాబర్ట్ కురియకోస్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలను వెల్లడించారు.

    Also Read: బోల్డ్ హీరోయిన్ తో పెళ్ళికి రెడీ అంటున్న హీరో !

    Mammootty

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. వైవిధ్యభరితమైన పాత్రలతో ఆకట్టుకుంటోన్న అనసూయ ‘ఖిలాడి’లో డ్యూయల్ రోల్‌లో నటించనుంది. బ్రాహ్మణ యువతిగా, మరో పాత్రలో ఆమె కన్పించనుంది. రెండింటిలో ఓ క్యారెక్టర్ కథ మధ్యలో చనిపోనుండగా మరో పాత్ర మాత్రం చివరివరకూ కొనసాగుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.

    Anasuya Bharadwaj

    ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా ‘పుష్ప’లో దాక్షాయణిగా నెగెటివ్ రోల్‌లో అలరించిన బుల్లితెర యాంకర్ డ్యూయల్ రోల్‌లో ఎలా ఉంటుందో చూడాలి. మొత్తమ్మీద ప్రస్తుతం టాలీవుడ్ ట్రెండ్స్ లో ఈ టాపిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

    Also Read:  పవన్ కళ్యాణ్ ‘ఒంటరి’!.. ఎందుకిలా వదిలేశారు?

    Tags