Medicover Doctors: మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ లో కోవిడ్ ఉన్న మహిళ సాధారణ డెలివరీ విజయవంతంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే కరొనాతో బాధపడుతున్న నిండు గర్భిణీ అత్యవసర పరిస్థితులలో ప్రసవం కొరకు దగ్గరగా ఉన్న ఆసుపత్రులకు వెళ్లగా కరోనా ఉందనీ , అప్పటికే గర్భాశయ జలాలు విచ్చిన్నం అయ్యాయని ఇటువంటి పరిస్థితులలో సిజేరియన్ కూడా కష్టతరం అవుతుందని సాధారణ ప్రసవం చేయలేమని తేల్చి చెప్పి వెనుకకు పంపగా చివరకు మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ కి తీసుకువచ్చారు .

మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ లో డాక్టర్ ఎస్ వి లక్ష్మి – సీనియర్ కన్సల్టెంట్ అబెస్ట్రిషన్ & గైనకాలోజిస్ట్ ,ఈ కేసుని సవాలుగా తీసుకొని శ్రమించి విజయవంతంగా నార్మల్ డెలివరీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “కరొనా కి సిజేరియన్ కి అసలు సంబంధం లేదు, వేరే ఇతర వ్యాధులు ఉన్నప్పుడు ఎలా అయితే సాధారణ డెలివరీ చేయగలమో , కోవిడ్ ఉన్నా కూడా అలాగే చేయవచ్చు. కోవిడ్ తేలికపాటి లక్షణాలు ఉంటె మనం సాధారణ డెలివెరి చేయవచ్చు. ఎప్పుడైతే కోవిడ్ తీవ్రస్థాయిలోఉంది , పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్లే ఆస్కారం ఉన్నపుడు మాత్రమే మనం సిజేరియన్ చేయవలసి ఉంటది , ఎందుకంటే అప్పుడు తల్లి బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉంటది కనుక. అటువంటి సమయంలోనే మనం సిజేరియన్ చేయాలి . గర్భాశయ జలాలు విచ్చిన్నం అయినప్పుడు కూడా సాధారణ డెలివరీకి ఆస్కారం ఉంది.
Also Read: చేసే పనులలో విజయం దక్కట్లేదా.. చేయాల్సిన వాస్తు మార్పులు ఇవే!
దానికంటూ కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. అవకాశం లేనప్పుడు, అత్యవసర పరిస్థితులలో మాత్రమే సిజేరియన్ చెయ్యాలి. కోవిడ్ ఉన్న మహిళలకు కూడా డెలివరీ చెయ్యొచ్చు, కోవిడ్ ని కారణంగా చూపి చికిత్సకు నిరాకరించడం , ఆసుపత్రిలో చేర్చుకోకపోవడం అనేది చాలా భాదాకరమైన విషయమని , మానవతా కోణంలో కూడా ఆలోచించాలని అన్నారు “.
ఈ సందర్భంగా పేషెంట్ తల్లిదండ్రులు మాట్లాడుతూ మా బిడ్డకు కోవిడ్ సోకింది అనగానే చాలా బయపడ్డాం. వెంటనే దేగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకోని వెళ్ళాం. వాళ్ళు కోవిడ్ ఉన్నదీ మరియు గర్భాశయ జలాలు విచ్చిన్నం అయ్యాయని మేము చేయలేము అని అన్నారు. అప్పుడు తెలిసినవాళ్ళు మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ కి వెంటనే తీసుకొనివచ్చాం. డాక్టర్ గారు చూసి ఏమి కాదు నేను చేస్తాను అని చెప్పి నార్మల్ డెలివరీ చేసారు. డాక్టర్ గారికి ధన్యవాదములు తెలిపారు.
Also Read: KCR: కేంద్రంపై 23 పాయింట్లతో అటాక్ చేయబోతున్న కేసీఆర్.. ప్లాన్ అదిరింది
[…] Rashi Khanna: హీరోయిన్లు సైడ్ ఇన్ కమ్ కోసం అసలు ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవడం లేదు. ఎక్కడ నాలుగు రూపాయలు వస్తాయో.. అక్కడకి వెళ్లిపోతున్నారు. నేటి మహానటి కీర్తి సురేష్ సైడ్ బిజినెస్ కోసం కొత్త దారులు ఎంచుకున్న క్రమంలో కీర్తి సురేశ్ కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ రాశీఖన్నా కూడా అదే బాటలో నడిచింది. సొంత యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించినట్లు రాశీఖన్నా అధికారికంగా ప్రకటించింది. […]