https://oktelugu.com/

చేసే పనులలో విజయం దక్కట్లేదా.. చేయాల్సిన వాస్తు మార్పులు ఇవే!

మనలో చాలామంది ప్రతిరోజూ తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అనుకూల ఫలితాలు వస్తే మరి కొన్నిసార్లు ఎంత కష్టపడిన అనుకూల ఫలితాలు రావు. కొన్నిసార్లు ఇంటి వాస్తు కూడా అనుకూల ఫలితాలు రాకపోవడానికి కారణం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. తరచూ నెగిటివ్ ఫలితాలే ఎదురవుతూ ఉంటే కొన్ని వాస్తు టిప్స్ ను పాటించడం ద్వారా చేసే పనులలో విజయం సాధించే ఛాన్స్ అయితే ఉంటుంది. మనలో కొంతమంది ఇంట్లో వస్తువులను చిందరవందరగా ఉంచుతారు. ఇలా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 31, 2022 / 04:16 PM IST
    Follow us on

    మనలో చాలామంది ప్రతిరోజూ తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అనుకూల ఫలితాలు వస్తే మరి కొన్నిసార్లు ఎంత కష్టపడిన అనుకూల ఫలితాలు రావు. కొన్నిసార్లు ఇంటి వాస్తు కూడా అనుకూల ఫలితాలు రాకపోవడానికి కారణం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. తరచూ నెగిటివ్ ఫలితాలే ఎదురవుతూ ఉంటే కొన్ని వాస్తు టిప్స్ ను పాటించడం ద్వారా చేసే పనులలో విజయం సాధించే ఛాన్స్ అయితే ఉంటుంది.

    మనలో కొంతమంది ఇంట్లో వస్తువులను చిందరవందరగా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల చేసే పనులలో విజయం దక్కే అవకాశాలు తగ్గుతాయని చెప్పవచ్చు. ఇంటి ఫర్నిచర్ ను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఫర్నిచర్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా అనుకున్న పనులు నెరవేరతాయి. ఇంట్లో వుడ్ తో చేసిన ఫర్నీచర్ నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది.

    మంచి రోజుల్లో మాత్రమే ఫర్నీచర్ ను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫర్నీచర్ మీద దేవుళ్ల ఫోటోలు లేదా జంతువుల ఫోటోలు ఉంటే కూడా మంచి జరుగుతుంది. పడమర లేదా దక్షిణ దిక్కులలో ఇంట్లో ఫర్నీచర్ ను ఉంచాలి. ఈ దిక్కులు కాకుండా ఇతర దిక్కులలో ఇప్పటికే ఫర్నీచర్ ను కొనుగోలు చేసిన వాళ్లు సైతం ఈ మార్పులు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

    వాస్తు వల్లే కొన్నిసార్లు చేస్తున్న పనులలో అనుకూల ఫలితాలు రాకుండా ఉంటాయి. ఈ విషయాలను గుర్తుంచుకుని వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.